BigTV English

Kadapa accident: కడప ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఆరుగురు మృతి

Kadapa accident: కడప ఘోర రోడ్డు ప్రమాదం, స్పాట్‌లో ఆరుగురు మృతి

Kadapa accident: ఉమ్మడి కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్‌లో ఆరుగురు మృతి చెందారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భారీ కంటెనర్.. కారుని ఢీ కొట్టింది. మృతుల్లో ఐదుగురు కడప జిల్లాకు చెందినవారు.


అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారివెళ్దాం.. కడప జిల్లా వడ్డెపల్లెకు చెందిన లక్ష్మీదేవి భర్త సత్యనారాయణ ఇటీవల మరణించాడు. ఆయన కర్మకాండను ముగింపుకుని బంధువుల ఇంట్లో అడుగు పెట్టేందుకు కారులో ఐదుగురు బయలుదేరారు.

కారు గువ్వల చెరువు ఘాట్‌లో రెండో మలుపు వద్ద రాగానే..  అతివేగంగా వస్తున్న కంటైనర్ అదుపు తప్పి కారుని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృత్యువాడ పడ్డారు. కంటైనర్ డ్రైవర్ కూడా చనిపోయాడు.  మృతులు కడప జిల్లా చక్రాయపేట మండలం వడ్డెపల్లెకు చెందిన నాగయ్య, చిన్న వెంకటమ్మ, నాగలక్ష్మీదేవి, షరీఫ్, కంటైనర్ డ్రైవర్ కూడా ఉన్నాడు.


ALSO READ: స్నానం చేసి వెళ్తుండగా వృద్ధుడిపై ఒక్కసారిగా దాడి చేసిన ఏనుగులు.. తీవ్ర గాయాలతో మృతి

కంటైనర్ చిత్తూరు జిల్లా నుంచి బ్యాటరీల లోడుతో మహారాష్ట్రకు వెళ్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. వేగానికి కంటైనర్ లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీశారు. లోయలోపడిన కంటైనర్ డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న వెంటనే కడప ఎస్పీ హర్షవర్థన్‌రాజు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×