BigTV English

Venus Transit In Virgo 2024: కన్య రాశిలో శుక్రుడు సంచారం.. సెప్టెంబర్ 18 వరకు వీరికి శుభ దినాలు

Venus Transit In Virgo 2024: కన్య రాశిలో శుక్రుడు సంచారం.. సెప్టెంబర్ 18 వరకు వీరికి శుభ దినాలు

Venus Transit In Virgo 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సూర్యుడి రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 25న కన్య రాశిలోకి శుక్రుడు ప్రవేశించాడు. 12 గ్రహాలు కొన్ని రాశులకు అధిపతులుగా చెబుతుంటారు. కన్య రాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. శుక్రుడు సంపద ఐశ్వర్యానికి కారణంగా చెబుతారు. ఆగస్ట్ 25 అర్థరాత్రి 1:20 గంటల నుంచి కన్య రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు .


సెప్టెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 2:04 గంటల వరకు శుక్రుడు కన్య రాశిలోనే సంచరిస్తాడు. శుక్రుడి సంచారం కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు శుక్రుడి సంచారం వల్ల శుభవార్తలను వింటారు. డబ్బు సంపాదించడానికి ఇది మంచి అవకాశం. శుక్రుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: శుక్రుడి సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ వ్యాపారాల లాభాలు పెరుగుతాయి. సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. తగాదాల మధ్య మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్ పరంగా ఇది మంచి సమయం.


వృషభ రాశి: ఈ సమయంలో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఎటువంటి పరిస్థితిలో నైనా మీ మనస్తత్వాన్ని మార్చుకోకండి. ఉద్యోగస్తులు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందేందుకు అవకాశం ఉంది. ప్రతీ వస్తువు విలువ అంచనా వేసిన తర్వాతనే తీసుకోండి. మీ పిల్లల అలవాట్లపై కూడా శ్రద్ధ వహించండి ఎందుకంటే వారు ఈ సమయంలో చెడు మార్గం వైపు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది.

మిథున రాశి: ఈ రాశుల వారు ఈ సమయంలో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు ఇది మంచి సమయం . ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రమకు తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది.

Also Read: గజకేసరి యోగం.. ఈ 5 రాశులపై కనకవర్షం

కర్కాటక రాశి: ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయం మీకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. తోబుట్టువులతో కూడా సత్సంబంధాలు కొనసాగుతాయి. మీరు చేయగలిగే పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. అంతే కాకుండా గతంలో పెట్టుబడి పెట్టిన వాటికి ప్రస్తుతం లాభాలను పొందుతారు. ఎటువంటి సమస్యలకైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వారు పనులను వాయిదా వేసుకోండి. లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త మార్గంలో పని చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. ప్రేమ వివాహం చేసుకున్న వారికి ఇది మంచి సమయం. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×