BigTV English

Actor Nikhil: హీరో నిఖిల్ కొడుకును చూశారా.. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా

Actor Nikhil: హీరో నిఖిల్ కొడుకును చూశారా.. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా

Actor Nikhil: టాలీవుడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  హ్యాపీడేస్ సినిమాతో నిఖిల్ తెలుగువారికి పరిచయమయ్యాడు.  ఆ సినిమా తరువాత మంచి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. నిఖిల్ కెరీర్ ను మార్చిన సినిమా అంటే.. స్వామి రారా.  నిఖిల్ కెరీర్ గురించి చెప్పాలంటే.. ఈ సినిమాకు ముందు, తరువాత అని చెప్పాలి.


స్వామిరారా తరువాత కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కిర్రాక్ పార్టీ, అర్జున్ సూరవరం.. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించాడు.  ఇక కార్తికేయ 2 తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారాడు. ఈ మధ్యనే కార్తికేయ 2 కు జాతీయ అవార్డు కూడా వరించిన విషయం విదితమే.

ఇక నిఖిల్ సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ కుర్ర హీరో తన కొడుకుతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు.  2020 లో నిఖిల్, పల్లవి వర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ఆరు నెలల క్రితమే నిఖిల్ – పల్లవి జంటకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టాకా.. నిఖిల్ కు అతడే లోకంగా మారిపోయాడు. నేడు కృష్ణాష్టమి పర్వదినం కావడంతో నిఖిల్  తన కొడుకును చిన్ని కృష్ణుడులా రెడీ చేసి.. మొదటిసారి కొడుకు ముఖాన్ని అభిమానులకు చూపించాడు.


అంతేకాకుండా నిఖిల్  కొడుకు పేరును కూడా రివీల్ చేశాడు. తన కొడుకు పేరు ధీర సిద్దార్థ అని చెప్పుకొచ్చాడు. ” ధీర సిద్ధార్థ తరుపున  మీ అందరికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..  నా శక్తి మరియు నా సంతోషానికి 6 నెలలు నిండాయి..  ధన్యవాదాలు ధీర మమ్మీ పల్లవి వర్మ” అని రాసుకొచ్చాడు. 

ధీర ఎంతో క్యూట్ గా ఉన్నాడు. చిన్ని కృష్ణుడుగా వెన్న తింటూ ఎంతో ముద్దుగా కనిపించాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయ్యో ఈ చిన్ని కృష్ణుడును చూస్తుంటే మా దిష్టే తగిలేలా ఉందే అని కొందరు.. సూపర్ అచ్చు  నిఖిల్ లానే ఉన్నాడు అని ఇంకొందరు  కామెంట్స్ చేస్తున్నారు.

ఇక నిఖిల్  కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం స్వయంభు తో బిజీగా ఉన్న నిఖిల్ చేతిలో ది ఇండియన్ హౌస్, కార్తీకేయ 3 సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ఈ కుర్ర హీరో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ గా ఎదగగలడేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×