Astrology 6 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో విజయాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. అవసరానికి డబ్బు అందుతుంది. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవాలి.
వృషభం:
వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. వృత్తి, వ్యాపార రంగాల్లో పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. వ్యాపారులు నష్టపోవచ్చు. ఉద్యోగులు తోటివారి సహకారంతో సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. శివపార్వతులను పూజించాలి.
మిథునం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైన విజయం సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక పురోగతి అంతంతమాత్రమే ఉంటుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. నవగ్రహ శ్లోకం చదవడం మంచిది.
కర్కాటకం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతి మందగిస్తుంది. మీ మీ రంగాల్లో మానసిక దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ కలహాలతో అశాంతి నెలకొంటుంది. ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంటుంది. ఆదాయానికి సరిపడా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ ఉంటుంది. అన్ని రంగాల వారికి అభివృద్ధి సాధించేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలించవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. గిట్టనివారితో ఆచితూచి వ్యవహరించాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. వృథా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. శనిధ్యానం శుభప్రదం.
కన్య:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో ఇతరుల సహకారం అవసరం. కొన్ని పనులు నిలిచిపోవడంతో నిరాశకు గురవుతారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివ సందర్శనం శుభప్రదం.
Also Read: బుధాదిత్య రాజయోగం ఈ 3 రాశుల జీవితాల్లో అద్భుతాలు సృష్టించబోతుంది
తుల:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో విపరీతమైన పోటీ ఉంటుంది. శివారాధనతో మరిన్ని మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సన్నిహితుల సహకారం ఉంటుంది. పెద్దలు అనుకూలంగా వ్యవహరించి అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. శుభవార్తం ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గోవిందనామాలు చదివితే మంచిది.
ధనుస్సు:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంతో హోదా పెరుగుతుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్తారు. ఇష్టదేవతారాధన శుభకరం.
మకరం:
మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విహార యాత్రలకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యుల్లో కలహాలు ఏర్పడవచ్చు. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
కుంభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. చేపట్టిన కీలక పనుల్లో తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి దెబ్బతినవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం:
మీన రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అన్ని రంగాల వారికి ఒత్తిడి, శారీరక శ్రమ పెరగవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.