E-Paper
Advertisement

Horoscope Today April 14th : ఆ రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి – ఆరోగ్యం విషయంలో జాగ్రత్త  

Horoscope Today April 14th : ఆ రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి – ఆరోగ్యం విషయంలో జాగ్రత్త  

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 14న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మిధునం: ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.

సింహం: సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. రావలసిన ధనం సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.

కన్య: కొన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

వృశ్చికం: ధన వ్యయ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు.

ధనస్సు: వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.

మకరం: దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.

కుంభం: నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు బంధు, మిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. సమాజంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×