E-Paper
Advertisement

Indian Railway: ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఇంతకీ అది ఎక్కడుందో తెలుసా?

Indian Railway: ఈ రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఇంతకీ అది ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలో అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఇండియన్ రైల్వే ఒకటి. అమెరికా, చైనా, రష్యా తర్వాత నాలుగో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశంగా ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. దేశ వ్యాప్తంగా 7300 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. నిత్యం సుమారు 20 వేల రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. వీటిలో సుమారు 13 వేల ప్యాసింజర్ రైళ్లు ఉండగా, మిగతావి గూడ్స్ రైళ్లు. ఇక దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లు యూనిక్ ఐడెంటిటీని కలిగి ఉన్నాయి. అలాంట వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రైల్వే స్టేషన్ కు వెళ్తే దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది.

దేశ నలుమూలలను కలిపే రైల్వే స్టేషన్

నిజానికి ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు సమీప రైల్వే స్టేషన్ నుంచి మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి నేరుగా రైలు సర్వీసు ఉండకపోవచ్చు. అప్పుడు కనెక్టింగ్ రైళ్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల బాగా అలసిపోయే అవకాశం ఉంటుంది. కానీ, దేశంలోని ఒక రైల్వే స్టేషన్ నుంచి ఇండియాలోని ప్రతి మారుమూల ప్రాంతానికి ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ స్టేషన్ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్లు వెళ్లగలిగే ఏకైక రైల్వే స్టేషన్ ఉత్తర ప్రదేశ్ లోని మధుర జంక్షన్. ఈ స్టేషన్ నుంచి దేశంలో దాదాపు ప్రతి నగర మార్గంలో రైళ్లు నడుస్తాయి. ప్రయాణికులు తరచుగా వేర్వేరు స్టేషన్లలో దిగి ఎక్కాల్సిన అవసరం లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.  దేశంలోని నాలుగు దిశలకు ప్రత్యక్ష రైలు సేవలను అందిస్తుంది.

ప్రతి రోజూ 197 రైళ్ల రాకపోకలు

దేశ రాజధాని ఢిల్లీ నుంచి దక్షిణ ప్రాంతాలకు ప్రయాణించే దాదాపు ప్రతి రైలు మధురై జంక్షన్ రైల్వే స్టేషన్ గుండా వెళుతుంది. ఉత్తరాన జమ్మూ, కాశ్మీర్, దక్షిణాన కన్యాకుమారి లాంటి సుదూర గమ్యస్థానాలకు కనెక్టివిటీని అందిస్తుంది. రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్‌ ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లతో పాటు సూపర్‌ ఫాస్ట్, ఎక్స్‌ ప్రెస్, MEMU/DEMU రైళ్లతో సహా ప్రతిరోజూ దాదాపు 197 రైళ్లు మధుర జంక్షన్‌లో ఆగుతాయి.

1875 నుంచి మధురైలో రైల్వే సేవలు ప్రారంభం

మధుర జంక్షన్‌లో రైలు కార్యకలాపాలు 1875లో ప్రారంభమయ్యాయి. ఇది నార్త్ సెంట్రల్ రైల్వేలో ఒక భాగం. ఈ స్టేషన్‌లో 10 ప్లాట్‌ ఫారమ్‌ లు ఉన్నా. దేశంలోని అత్యుత్తమ రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. ఇది అధిక సంఖ్యలో  రద్దీని కలిగి ఉంటుంది. ప్రయాణీకులను 24 గంటల పాటు సేవలు అందిస్తుంది. మధుర జంక్షన్ నుంచి రైళ్లు ఢిల్లీ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, చత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్, బీహార్ సహా అనేక ఇతర రాష్ట్రాలను కలిపే రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ స్టేషన్ మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో ఉండటం వల్ల గణనీయమైన ప్రయాణీకుల రద్దీని కలిగి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాత్రికులను శ్రీకృష్ణుడి జన్మస్థలాన్ని సందర్శించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Read Also: రైల్వే టికెట్లలో ఇన్ని రకాల వెయిటింగ్ లిస్టులు ఉంటాయా? మీరు అస్సలు ఊహించి ఉండరు!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×