E-Paper
Advertisement

Horoscope Today April 18th : రియల్‌ ఎస్టేట్‌ వారికి లాభాలు – వ్యాపారస్తులకు అర్థికాభివృద్ది

Horoscope Today April 18th : రియల్‌ ఎస్టేట్‌ వారికి లాభాలు – వ్యాపారస్తులకు అర్థికాభివృద్ది

Horoscope Today :గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 18న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటాబయట రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి.

వృషభం: ఇంటికి చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఇంట్లో వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు మరింత లాభసాటిగా
సాగుతాయి.

మిధునం: స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రం సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురవుతారు.

కర్కాటకం: ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభ వార్తలు వింటారు.  వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం:  ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

కన్య: అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. సన్నిహితులతో అకారణంగా విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

తుల: దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి.

వృశ్చికం: ధన పరంగా లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అందిన వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

ధనస్సు: బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి తగాదాలను రాజీ చేసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారంలో ఆలోచనలు కలసి వస్తాయి. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.

మకరం: వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

కుంభం: సోదర వర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్థుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరిగినప్పటికీ నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.

మీనం: భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది.

 

ALSO READ: గ్రహబాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్‌ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×