Coffee Scrub: అందమైన, మెరిసే చర్మాన్ని పొందడానికి మీకు ఎల్లప్పుడూ ఖరీదైన ఉత్పత్తులే వాడనవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ప్రభావవంతమైన పరిష్కారాలను కూడా ట్రై చేయవచ్చు.
కాఫీ పౌడర్ కూడా ఇలాంటి ఒక పదార్ధమే. కాఫీ పౌడర్‌ను వివిధ రకాలుగా ముఖానికి వాడవచ్చు. కాఫీ పౌడర్‌తో తయారు చేసిన స్క్రబ్ మాస్క్‌లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, మృత కణాలను తొలగించడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న కాఫీ పౌడర్‌ను ముఖ సౌందర్యానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ కాఫీ స్క్రబ్ ప్రయోజనాలు:
కాఫీ పౌడర్ ముఖానికి సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. తాజా, మెరిసే చర్మాన్ని కూడా అందిస్తుంది.
కాఫీ పౌడర్‌ని చర్మంపై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ ఉత్తేజితమవుతుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యకరమైన , మెరిసే చర్మానికి దారితీస్తుంది.
కాఫీలోని కెఫిన్ రక్త నాళాలను కుదించడానికి, చర్మంపై మంటను తగ్గించడానికి , కళ్ళ కింద చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.
కాఫీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలతో పోరాడటానికి, చికాకు కలిగించే చర్మాన్ని ఉపశమనం చేస్తాయి.
కాఫీ స్క్రబ్ మాస్క్‌ని క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మాన్ని బిగుతుగా మారుతుంది. అంతే కాకుండా ఫైన్ లైన్స్ ను తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
కాఫీతో ఫేస్ స్క్రబ్‌ల తయారీ :
బ్లాక్ కాఫీ స్క్రబ్ మాస్క్:
కావాల్సిన పదార్థాలు
బ్లాక్ కాఫీ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు
తేనె-1 టేబుల్ స్పూన్
పెరుగు- 1 టేబుల్ స్పూన్
పాలు- 1 టీస్పూన్
కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె- 1 స్పూన్
ఎలా తయారు చేయాలి ?
పైన తెలిపిన అన్ని పదార్థాలను కలిపి మెత్తని పేస్ట్‌లాగా తయారు చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి.
2. బ్లాక్ కాఫీ, కలబంద మాస్క్:
కావాల్సిన పదార్థాలు
కాఫీ పౌడర్- 2 టేబుల్ స్పూన్ల
తాజా అలోవెరా జెల్- 2 టేబుల్ స్పూన్ల
ఎలా తయారు చేయాలి ?
పైన తెలిపిన రెండు పదార్థాలను బాగా కలిపి ముఖం మీద అప్లై చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి.. తర్వాత వాష్ చేయండి.
3. బ్లాక్ కాఫీ , పసుపుతో మాస్క్ :
కావాల్సిన పదార్థాలు:
కాఫీ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
పసుపు- 1 స్పూన్
పెరుగు- 1 టేబుల్ స్పూన్
ఎలా తయారు చేయాలి ?
పైన తెలిపిన పదార్థాలను మెత్తని పేస్ట్ లాగా చేసి ముఖం మీద సమానంగా అప్లై చేయండి. అనంతరం 10-15 నిమిషాలు అలాగే ఉంచి.. తర్వాత కడిగేయండి.
Also Read: ఇలా చేస్తే.. మెడపై ఉన్న నలుపు క్షణాల్లోనే మాయం !
4. బ్లాక్ కాఫీ, నిమ్మకాయ మాస్క్:
కావాల్సిన పదార్థాలు
కాఫీ పౌడర్- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1 టీస్పూన్
తేనె- 1 టీస్పూన్
ఎలా తయారు చేయాలి ?
పైన తెలిపిన అన్ని పదార్థాలను కలిపి చర్మంపై అప్లై చేయండి. దీన్ని ముఖం మీద 10 నిమిషాలు అప్లై చేసి.. తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఉంటుంది.