E-Paper
Advertisement

Horoscope Today April 19th : ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – నిరుద్యోగులకు శుభవార్తలు

Horoscope Today April 19th : ఆ రాశి ఉద్యోగులకు ప్రమోషన్లు – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 19న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇంటాబయట ఊహించని సమస్యలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.

Advertisement

వృషభం: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు  పదోన్నతులు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయటపడతారు.

మిధునం: మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తుల శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

Advertisement

కర్కాటకం: సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహం: చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

కన్య: తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

తుల: ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులకు ఉంటాయి.

వృశ్చికం: సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనస్సు: నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.

మకరం: వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకున్న  సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసి రావు. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది.

మీనం: వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్థులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

 

ALSO READ: గ్రహబాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్‌ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×