Vitamin E Capsules: ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. అంతే కాకుండా ముఖంపై మెరుపు కోసం రకరకాల క్రీములను వాడుతుంటారు. అయినప్పటికీ.. ఆ మెరుపు కొన్ని నిమిషాల్లోనే మాయమవుతుంది. చాలా సార్లు రసాయనతో తయారు చేసిన ఉత్పత్తులను వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి సమయంలో సులభంగా లభించే విటమిన్ ఇ క్యాప్సూల్స్ ముఖానికి వాడటం మంచిది.
విటమిన్ ఇ లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చర్మ సంరక్షణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి గ్లోయింగ్ స్కిన్ కోసం విటమిన్ E క్యాప్సూల్స్ ఉపయోగించవచ్చు. ఈ రోజు మనం విటమిన్ ఇ క్యాప్సూల్స్ మీ ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుతాయో తెలుసుకుందాం.
అలోవెరా జెల్:
మీరు అలోవెరా జెల్‌తో విటమిన్ ఇ క్యాప్సూల్స్ ఉపయోగించవచ్చు. దీని కోసం.. మీరు ఒక చెంచా అలోవెరా జెల్‌లో ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ కలిపి సహజ మాయిశ్చరైజర్ తయారు చేసుకోవచ్చు. తర్వాత దీన్ని మీ ముఖం, మెడ అంతటా పూర్తిగా అప్లై చేయండి. రాత్రి పడుకునే ముందు దీన్ని వాడటం మంచిది. మరుసటి రోజు ఉదయం, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ ముఖంపై మచ్చలు తగ్గిపోయి మీ చర్మం సహజమైన మెరుపును పొందుతుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె , విటమిన్ E కలయిక మీ చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మీ చర్మం మెరుస్తుంది. రాత్రిపూట 1 టీస్పూన్ కొబ్బరి నూనెతో 1 విటమిన్ E క్యాప్సూల్ నూనెను బాగా కలపండి. దీని తరువాత.. మెడతో సహా మొత్తం ముఖం మీద అప్లై చేసి కొన్ని సెకన్ల పాటు మసాజ్ చేసి అలాగే వదిలేయండి. ఉదయం గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కోండి.
పెరుగు:
పెరుగుతో విటమిన్ E ని ఉపయోగించడానికి.. 1 టేబుల్ స్పూన్ పెరుగులో 1 విటమిన్ E క్యాప్సూల్స్ కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖంపై బాగా అప్లై చేసి.. చేతులతో 1 నిమిషం పాటు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద 20 నిమిషాలు ఉంచిన తర్వాత.. ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ముఖం మీద ఉన్న మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
తేనె:
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను తేనెతో కలిపి కూడా ముఖానికి అప్లై చేయవచ్చు. 2 విటమిన్ E క్యాప్యూల్స్ ఒక టీస్పూన్ తేనెతో కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా చర్మం కూడా పొడిబారకుండా ఉంటుంది.
ఆలివ్ నూనె:
మీరు ఆలివ్ నూనెతో కలిపి విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను కూడా అప్లై చేయవచ్చు. దీనికోసం.. ఒక చెంచా ఆలివ్ ఆయిల్ తీసుకుని.. అందులో 2 విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి, మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. మీరు దీనిని 10 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై శుభ్రం చేయండి. కానీ, మీ చర్మం ఎక్కువగా పొడిగా ఉంటే మీరు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి రాత్రంతా నిద్రపోవచ్చు.
Also Read: సన్ స్క్రీన్ వాడకుండానే.. సమ్మర్‌లోనూ వీటితో కాంతివంతమైన చర్మం
గ్లిజరిన్ :
గ్లిజరిన్‌ను విటమిన్ ఇతో కలిపి మీ ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం మృదువుగా, తేమగా మారుతుంది. అంతే కాకుండా మీ చర్మం పొడిబారడం కూడా తగ్గుతుంది. మీరు 1 విటమిన్ E క్యాప్సూల్‌ని కొన్ని చుక్కల గ్లిజరిన్‌తో కలిపి పడుకునే ముందు మీ ముఖంపై సమానంగా అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ముఖం అందంగా మెరిసిపోతుంది.