Vishnu Priya: బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకవైపు బుల్లితెర పై వస్తున్న షోలలో మెరుస్తుంది. అలాగే సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. గతంలో బుల్లితెర పై కనిపిస్తున్న కొన్ని షోలకు ఒకప్పుడు యాంకర్ గా కనిపించింది. యూత్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే.. మొన్నటివరకు నెట్టింట గ్లామర్ మెరుపులు మెరిపించే విష్ణు తాజాగా దైవ చింతన మొదలు పెట్టింది. సడెన్ గా ఈ మార్పు ఏంటనే ప్రశ్న అందరిలో మెదులుతుంది. అసలేందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో ఒకసారి వివరాలు తెలుసుకుందాం..
విష్ణు ప్రియా లైఫ్..
విష్ణు ప్రియా ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో జన్మించింది. ఆమెకు చెల్లెలు పావని ఉన్నారు. ఈమెకు మూడేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తల్లి దగ్గరే విష్ణు ప్రియ పెరిగింది. చిన్న వయసులోనే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేసింది. పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేది. చదువు పూర్తి చేసిన తర్వాత సినీ రంగం వైపు అడుగులు వేసిన విష్ణుప్రియకు తమిళంలో ఓ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అలా ఒక్కో సినిమా ఆఫర్ ఆమెని వెతుక్కుంటూ రావడంతో ఆమె లైఫ్ సినిమాల వైపు టర్న్ తీసుకుంది.
సినిమా అవకాశాలు..
ఎస్ఎస్ రాజమౌళి- ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన యమదొంగలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అవకాశాల కోసం ఎంతో కష్టపడి చివరికి షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఎన్నో షార్ట్ ఫీలిమ్స్ లలో నటించి మెప్పించింది. పెళ్లిచూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ, యెల్లో, సోడాబుడ్డీ, ఇండియన్స్ ఏజ్ 25 వంటి వాటిలో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెర పై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈటీవీ ప్లస్ ఛానెల్‌లో ప్రసారమైన పోవే పోరా ప్రోగ్రామ్‌ను సుడిగాలి సుధీర్‌తో కలిసి అద్భుతంగా హోస్ట్ చేసి పాపులర్ అయ్యింది. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తక్కువ కాలంలోనే స్టార్ లిస్ట్ లోకి. చేరిపోయింది. గతేడాది బిగ్‌బాస్ తెలుగు 8లోనూ అవకాశం దక్కించుకుంది. ఇక తాజాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసి కేసులో ఇరుక్కుంది.
యాంకరింగ్ కు గుడ్ బై..
విష్ణు ప్రియా కెరీర్ పీక్స్ లో దూసుకుపోతున్న నేపథ్యం లో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. కొద్దిరోజులు హిమాలయాల్లోనే ఉండాలని అనుకుంటున్నానని.. కొన్నాళ్లు హిమాలయాలే నా ఇల్లు అని విష్ణు ప్రియ తెలిపారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుండటం తో హిమాలయాల్లోనే ఉండి భగవంతుడి సేవలో ఉండాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా బుల్లితెరకు గుడ్ బై చెప్పేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదైన కారణం ఉందేమో విష్ణు ప్రియా క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చెయ్యాలి..