BigTV English

Horoscope Today April 1st : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం – వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు 

Horoscope Today April 1st : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం – వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు 

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 1న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేషం : సమాజంలో ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.

వృషభం: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట బాధ్యతలు మానసికంగా చికాకు కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలసిరావు. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.


మిధునం: మాతృ వర్గ బంధు మిత్రులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. ఉద్యోగస్థులకు ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. మిత్రులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

కర్కాటకం: బంధు, మిత్రులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

సింహం : వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులు బాధ్యతలు నిర్వహించడంలో లోటుపాట్లు తప్పవు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సోదరులతో భూ సంబంధిత వివాదాలు చికాకు పరుస్తాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. నేత్ర సంభంధిత సమస్యలు బాధిస్తాయి.

కన్య: నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఇంట్లో దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: ముఖ్యమైన పనులలో ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయాల వలన నష్టాలు తప్పవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది.

వృశ్చికం: ఆర్థికంగా వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. దూరపు బంధువుల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సహంగా సాగుతాయి. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి.

ధనస్సు: వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.

మకరం: వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.

కుంభం: బంధు మిత్రుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది.

మీనం: చాలాకాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్దిక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంబానికి సన్నిహితుల సహాయం అందుతుంది. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Bed Room Vastu: పొరపాటున కూడా.. ఇలాంటి వస్తువులు బెడ్ రూంలో పెట్టొద్దు !

Bullet Baba temple: ఈ గుడిలో ప్రసాదంగా మద్యం.. మిస్టరీగా బుల్లెట్ బాబా రహస్య ఆలయం!

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Big Stories

×