BigTV English

Nindu Noorella Saavasam Serial Today April 1st : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మీనన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన అమర్‌ – రిటర్న్‌ గిఫ్ట్‌ పంపిస్తానన్న మీనన్‌

Nindu Noorella Saavasam Serial Today April 1st : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మీనన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన అమర్‌ – రిటర్న్‌ గిఫ్ట్‌ పంపిస్తానన్న మీనన్‌

Nindu Noorella Saavasam Serial Today Episode :  ఆడిటోరియం దగ్గరకు పరుగెత్తుకొచ్చిన అమర్‌కు మెయిన్‌ డోర్‌ క్లోజ్‌ చేసి ఉండటంతో లోపలికి వెళ్లడానికి రాదు. దీంతో డోర్‌ దగ్గరే ఆగిపోతారు. ఇంతలో రాథోడ్‌ వచ్చి సార్‌ డోర్స్‌ అన్ని క్లో్‌జ్‌ చేశారని చెప్తాడు. అయితే ఆడిటోరియం లోకి ఎన్ని డోర్స్‌ ఉన్నాయో తెలుసుకో.. స్నైపర్స్‌ను రెడీగాఉండమని చెప్పు.. లోపల ఏం జరిగినా నాకు వెంటనే తెలియాలి అనగానే రాథోడ్‌ ఓకే సార్‌ అంటూ వెళ్తాడు.  మరోవైపు మీనన్‌ లోపల మైక్ తీసుకుని అందరినీ హాయ్‌ అంటూ పిలుస్తాడు. ఎవ్వరూ పలకరు. అందరూ షాకింగ్‌లో ఉంటారు. దీంతో నేను పిలిచినప్పుడు ఎవ్వరూ పలకకపోతే.. ఒక బుల్లెట్‌ వాడతా..? అంటూ బెదిరించడంతో అందరూ బలవంతంగా హాయ్ అని పలుకుతారు. దీంతో మీనన్‌ ఇది కావాలి. ఇలా నేను చెప్పింది చెప్పినట్టు బుద్దిగా వింటే నా పని నేను చేసుకుని వెళ్లిపోతా అని చెప్తాడు.


మరోవైపు బయట జవాన్‌ వచ్చి మేడం ఎవరో టన్నెల్‌ బ్రేక్‌ చేశారు అని చెప్తాడు. దీంతో ఎస్సై అమర్‌ను మీ అనుమానమే నిజం అయింది సార్‌. అని చెప్తుంది. దీంతో అమర్‌ అంటే లోపలి నుంచే ఎవరో మీనన్‌ కు హెల్ప్‌ చేశారు అంటుంది. దీంతో ఎస్సై సార్‌ సీసీ కెమెరా ఉంది పుటేజీ చూసి ఎవరో కనిపెట్టవచ్చు అంటుంది. దీంతో అమర్‌, రాథోడ్‌కు కు ఫోన్‌ చేసి సీసీ టీవీ పుటేజీ తీసుకురా అని చెప్తాడు. రాథోడ్‌ సరే అంటాడు. ఇక లోపల ఉన్న మీనన్‌ ను పట్టుకోవడం కంటే ముందు మినిస్టర్‌ గారిని కాపాడాలి అంటాడు. దీంతో ఎస్సై సార్‌ వాష్‌ రూం దగ్గర ఉన్న విండోను బ్రేక్‌ చేస్తే లోపలికి వెళ్లొచ్చు అని చెప్తుంది. అమర్‌ వద్దు శివ అది రిస్క్‌. మనం లోపలికి వెళ్లబోతున్నాం అన్న చిన్న డౌటు మీనన్‌కు వచ్చినా లోపల వాడు ప్రజల ప్రాణాలు తీసేస్తాడు. అని చెప్తుండగానే.. ఇంతలో రాథోడ్‌ వస్తాడు. సార్‌ స్నైపర్స్‌ పొజిషన్‌లో ఉన్నారు సార్‌. కానీ విండోస్‌ కు కర్టెన్స్‌ అడ్డం ఉండటం వల్లన లోపల ఏమీ కనిపించడం లేదు సార్‌ అని చెప్తాడు.

దీంతో అమర్‌ ఇరిటేటింగ్‌ గా ఎంత మంది వచ్చారో తెలియదు.. ఏం తీసుకొచ్చారో తెలియదు. కనీసం రౌడీలు ఉన్న పొజిషన్‌ తెలిస్తే అయినా ప్లాన్‌ రెడీ చేసుకుని అటాక్‌ చేయోచ్చు.. ఇప్పుడు ఏం చేయాలి అంటాడు. మరోవైపు లోపల మిస్సమ్మను  షూట్‌ చేయబోతుంటే.. వద్దు నన్ను షూట్‌ చేయోద్దు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న అమర్‌ షాక్‌ అవుతాడు. అయితే లోపల మీనన్‌ కాల్చింది మిస్సమ్మ పక్కనే ఉన్న సెక్యూరిటీని. దీంతో పిల్లలు పెద్దలు అందరూ భయపడుతుంటారు. ఇంతలో అమర్‌ వాకీటాకీలో లోపల ఏ ఒక్కరి ప్రాణం పోయినా..మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను అంటాడు. దీంతో మీనన్‌ అయ్యో లేట్‌ చేశావు అమరేంద్ర. జస్ట్‌ ఇప్పుడే మీలో ఒకడు హీరో అవ్వడానికి ట్రై చేశాడు. షూట్‌ చేసేశా..? కానీ బతుకుతాడో లేదో గ్యారంటీ ఇవ్వలేను. కానీ ఇప్పుడు ఇక్కడున్న అందరూ బతుకుతారని గ్యారంటీ ఇవ్వగలను. దానికి బదులుగా నువ్వు నాకో చిన్న ఫేవర్‌ చేయాలి అని అడగ్గానే.. అమర్‌ ఏంటది అని అడుగుతాడు.


దీంతో మీనన్‌ ఈ మినిస్టర్‌ ను ఈ జనాల్ని నీకు అప్పగిస్తాను. దానికి బదులుగా నాకు కావాల్సిన మినిస్టర్‌ ను నా మనుషులను నాకు  అప్పగించాలి అని అడుగుతాడు. దీంతో అది కుదరదని నీకు తెలుసు కదా మీనన్ అంటాడు అమర్‌. అయితే నీకు పర్సనల్‌ గిఫ్ట్‌ పంపిస్తాను అంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. రాథోడ్‌ కంగారుగా సార్‌ లోపల మీ ఫ్యామిలీ ఉందని వాడికి తెలుసు సార్‌ వాళ్లను ఏమైనా చేస్తే అంటాడు. ఎస్సై శివ కూడా పిల్లలను ఏమీచేయడు కాబట్టి భాగీని ఏమైనా చేయోచ్చు సార్‌ అంటుంది.

అయినా అమర్‌ ఏ టెన్షన్‌ లేకుండా చూస్తుంటాడు. దీంతో ఎస్సై శివ ఏమైంది సార్‌ మీనన్‌ మీ ఆవిడను చంపబోతున్నాడు. మీరేంటి సార్‌ చాలా కూల్‌గా ఉన్నారు. నవ్వుతున్నారేంటి సార్‌ అని అడుగుతుంది. దీంతో అమర్‌ మీకు భాగీ గురించి పూర్తిగా తెలియదు. ఇంక నా పిల్లలు  అంటావా..? వాళ్లకు ప్రాబ్లమ్‌ వస్తే సొల్యూషన్‌ కోసం వెతుకుతారు తప్ప.. సైలెంట్‌గా కూర్చోరు. ఇందాకటి నుంచి లోపల ఎంత మంది ఉన్నారు. లోపలికి ఎలా వెళ్లాలి అని ప్లాన్‌ చేస్తున్నాము కదా..? ఇక ప్లానింగ్ ఏమీ అవసరం లేదు.  అందరూ అటాక్‌ కు రెడీగా ఉండండి.. అంటూ అమర్‌  చెప్పగానే.. ఎస్సై షాకింగ్‌ గా చూస్తుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను రెచ్చగొట్టిన పల్లవి.. పోలీస్ కంప్లైంట్.. ప్రణతి కోసం నిజం చెప్తాడా..?

GudiGantalu Today episode: మీనా మిస్సింగ్.. ప్రభావతి ఇంట్లో టెన్షన్..లెటర్ తో ఇంట్లో బాంబ్..

Nindu Noorella Saavasam Serial Today october 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు చంభా కొత్త ప్లాన్‌    

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..కత్తి పట్టిన ప్రేమ.. ఇది కదా ట్విస్ట్ అంటే..

Big tv Kissik Talks: మహేష్ విట్టా లవ్ లో ఇన్ని  ట్విస్టులా.. నా ఆటోగ్రాఫ్ సినిమాని తలపిస్తోందిగా?

Big tv Kissik Talks: బిగ్ బాస్ నా జీవితాన్నే మార్చేసింది.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోలేను?

Big tv Kissik Talks: పేరుకే గొప్ప నటుడు.. సొంత ఇల్లు కూడా లేదు.. ఇండస్ట్రీలో ఇంత మోసమా?

Big Stories

×