Roasted Chana: వేసవిలో సరైన ఆహారాన్ని ఎంచుకోవడం మన ఆరోగ్యం శక్తి స్థాయిలను కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి సమయంలో పుట్నాలు తినడం ఒక అద్భుతమైన ఎంపిక. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పుట్నాల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం, ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. క్రమం తప్పకుండా పుట్నాలను తినడం వల్ల వివిధ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
పుల్నాలు తినడం వల్ల శక్తి స్థాయిలు పెరగడమే కాకుండా.. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, బరువు నియంత్రణలో సహాయపడటం ,గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో , ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
పుట్నాలు తిరడం వల్ల అనేక లాభాలు :
శక్తికి మూలం:
పుట్నాల్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవిలో మీకు అలసిపోయి బలహీనంగా అనిపిస్తే.. ఒక గుప్పెడు వేయించిన పుట్నాలు తినడం వల్ల మీకు తాజాదనం, శక్తి లభిస్తుంది. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
బరువు నియంత్రణ:
ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందుకే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందా. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది ఎక్కువ తినాలనే కోరికను కూడా తగ్గిస్తుంది. పుట్నాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
జీర్ణవ్యవస్థ మెరుగుదల:
ఫైబర్ అధికంగా ఉండటం వల్ల.. పుట్నాలు శనగలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయ పడుతుంది. అంతే కాకుండా పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా వీటిని తీనడం వల్ల కడుపు సంబంధిత రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయి:
వేయించిన శనగపప్పులో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది డయాబెటిక్ రోగులకు ఒక అద్భుతమైన స్నాక్ గా కూడా పని చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Also Read: సమ్మర్‌లో.. వారాల తరబడి నీరు లేకుండా జీవించే మొక్కలు ఇవే !
మెరుగైన గుండె ఆరోగ్యం:
పుట్నాల్లో ఉండే పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, తక్కువ సోడియం స్థాయిలు గుండెకు మేలు చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది.
వేయించిన శనగపప్పులో ఎక్కువ మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది
, తద్వారా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది రక్తహీనత వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా రక్త నాణ్యతను మెరుగుపరుస్తుంది.