E-Paper
Advertisement

Horoscope Today April 24th : ఇష్టమైన వ్యక్తులు ఇంటికి వస్తారు – వ్యాపారులకు అనుకోని లాభాలు

Horoscope Today April 24th : ఇష్టమైన వ్యక్తులు ఇంటికి వస్తారు – వ్యాపారులకు అనుకోని లాభాలు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 24న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి.

Advertisement

వృషభం: ఆకస్మిక ధనలబ్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో పలుకుపడి పెరుగుతుంది. సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

మిధునం: ఇంటా బయట అందరితో మాటలు పడవలసి వస్తుంది. రుణ ఒత్తిడి తొలగడానికి నూతన రుణాలు చెయ్యాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రతికూల వాతావరణం ఉంటుంది.

Advertisement

కర్కాటకం: సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

సింహం: కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కన్య: అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరపు బంధువుల రాకం ఆనందం కలిగిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు అందుతాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

తుల: వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలిసి విందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు అంచనాలు అందుకుంటారు.

వృశ్చికం: దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటు పాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.

ధనస్సు: చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులకు నచ్చవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: ఇంట్లో సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు.

కుంభం: నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో ఉన్న  వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారంలో స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

మీనం: వ్యాపార వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో  మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు ఉండదు.

 

ALSO READ: జన్మజన్మల్లోవెంటాడేకర్మలుఅవేనటమీరు కర్మలుచేశారోతెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×