BigTV English

Tollywood Heros: సక్సెస్ ఫుల్ హీరోతో మిడ్ నైట్ పార్టీలు.. కానీ వీళ్లకు మాత్రం డిజాస్టర్..

Tollywood Heros: సక్సెస్ ఫుల్ హీరోతో మిడ్ నైట్ పార్టీలు.. కానీ వీళ్లకు మాత్రం డిజాస్టర్..

Tollywood Heros: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.. ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత అన్ని సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. ముఖ్యం హీరోల పరిస్థితులు ఇలానే ఉన్నాయి. కెరీర్ మొదట్లో వరుసగా హిట్ సినిమాలు చేసి సక్సెస్ అయిన హీరోలకు ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తుంది. గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు కొట్టిన వాళ్ళే ఇప్పుడు ప్లాప్ మూవీలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఆ హీరోల సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. కానీ హిట్ అవ్వలేదు. ఇంతకీ ఆ హీరోలు స్టార్ హీరోతో తిరుగుతున్నారు. కానీ లక్ కలిసి రాకపోవడం ఏంటో అనే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ కుర్ర హీరోలు ఎవరు? స్టార్ హీరో ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఈ ఏడాది ప్లాప్ మూవీలతో హీరోలు..

గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది హిట్ సినిమాల సంఖ్య పూర్తిగా తగ్గింది. ముఖ్యం యంగ్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టాయి. అలాంటి సినిమాలలో లైలా, జాక్ మూవీలు కూడా ఉన్నాయి. అవును నిజమే కదా.. విశ్వక్ సేన్ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. మొదటి మూవీతోనే మాస్ హీరోగా ట్యాగ్ ను అందుకున్నాడు. గత ఏడాది వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. మూడు సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఈ ఏడాది లైలా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దారుణంగా బోల్తా కొట్టింది.


అదే విధంగా మరో స్టార్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. గత ఏడాది టిల్లు స్క్వేర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సఫీస్ ను షేక్ చేస్తూ రికార్డులు బ్రేక్ చేస్తూ భారీ కలెక్షన్స్ ను వసూల్ చేశాడు. మూవీ సూపర్ హిట్ అయ్యింది. అదే ఊపులో ఈ ఏడాది డిఫరెంట్ స్టోరీతో జాక్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. స్టోరీలో దమ్ము లేకపోవడంతో భారీ పరాజయాన్ని పొందింది.. అయితే వీరిద్దరి గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి చూసేద్దాం..

Also Read:మొదటి సినిమా హిట్.. ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు వీరే..

స్టార్ హీరోతో పార్టీలు.. సినిమాలకు నో యూజ్.. 

వీరిద్దరూ ఏ పని చేసిన కలిసే చేస్తారు. ఈ మధ్య స్టార్ హీరోలను కలుస్తూ వారితో ప్రైవేట్ పార్టీలకు హాజరవుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అంత పెద్ద స్టార్ హీరోతో ఫ్రెండ్ షిప్ చేస్తున్న వాళ్ళ సినిమాలకు మైనస్ అయ్యిందనే చెప్పాలి. ఆ హీరో మాత్రం ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. మిడ్ నైట్ పార్టీలు పెద్దగా కలిసి రాలేదు. ఇక ఈ హీరోలు పార్టీలు కన్న స్టోరీ పై ఫోకస్ పెడితో హిట్ అవుతారని కొందరి అభిప్రాయం. నెక్స్ట్ ఎలాంటి స్టోరీలతో సినిమాలు చేస్తారో చూడాలి..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×