BigTV English

Tollywood Heroines : మొదటి సినిమా హిట్.. ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు వీరే..

Tollywood Heroines : మొదటి సినిమా హిట్.. ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు వీరే..

Tollywood Heroines : సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే.. ఈరోజు స్టార్ అయిన వాళ్లు కూడా ఒక్క ప్లాప్ మూవీ పడితే లైఫ్ టర్న్ అవుతుంది. ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కు ఇదే పరిస్థితి. ఇది నిజమే అనే కొందరు భావిస్తున్నారు. అయితే మొదటి మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న కొందరు హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆ హీరోయిన్లు ఎందుకు ఇండస్ట్రీని వదిలారు? అందుకు బలమైన కారణాలు ఉన్నాయా? అన్న విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


ఒక్క మూవీతో దూరమైన హీరోయిన్లు.. 

సినీ ఇండస్ట్రీలో హీరోలు సక్సెస్ అయినంతగా హీరోయిన్ లు అవ్వలేరు. ఒక్క మూవీ ప్లాప్ అయితే మళ్లీ అవకాశాలు రావడం చాలా కష్టం అని సినీ పెద్దలు అంటున్నారు. ఇండస్ట్రీలో ఎదగాలి అంటే టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి అని అంతా అంటుంటారు. ఇక సినిమాల విషయంలో హీరోయిన్లు ఎంతో జాగ్రత్త తీసుకుంటూ కొంతకాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ మొదటి సినిమాతో విజయం వచ్చినా సరే ఆ తర్వాత మరొక సినిమాలో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. అలాంటి హీరోయిన్లు బోలెడు మంది ఉన్నారు. ఆ హీరోయిన్లు ఎవరో చూడండి..


ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు.. 

రాధా కూతురిగా జోష్ సినిమా తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత దమ్ము సినిమా చేసిన కార్తీక ఇప్పుడు టీవీ రంగానికి పరిమితమైంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఎన్నో సినిమాలు చేసింది. ఒక మూవీ చేసింది బేబీ శ్యామిలి ఓయ్ మూవీతో హీరోయిన్ అయ్యింది. కానీ ఆ తరువాత ఇండస్ట్రీ కి దూరం అయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమాతో హీరోయిన్ గా శియా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వేదం సినిమాలో కనిపించిన ఈమె మళ్లీ సినిమాలలో కనిపించలేదు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మొదటి మూవీ చిరుత హీరోయిన్ నేహా శర్మ ఒకటి, రెండు సినిమాలతో ఇండస్ట్రీకి దూరమైంది. అల్లు అర్జున్ తో బన్నీ సినిమాలో ఆడి పాడింది గౌరీ ముంజాల్‌. కానీ మళ్ళీ సినిమాలలో నటించలేదు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అనురాధ మెహతా, భాను శ్రీ మెహ్ర, అన్షు, రీచా వంటి ఎంతో మంది హీరోయిన్లు మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసారు. ప్రస్తుతం వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు.. ఇక కొందరు స్టార్ హీరోయిన్ల పరిస్థితులు అలానే ఉన్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×