E-Paper
Advertisement

Horoscope Today April 25th : నూతన వాహనం కొనుగోలు చేస్తారు – విందు, వినోదాల్లో పాల్గొంటారు

Horoscope Today April 25th : నూతన వాహనం కొనుగోలు చేస్తారు – విందు, వినోదాల్లో పాల్గొంటారు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 25న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. బంధువర్గంతో విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనల్లో స్థిరత్వం ఉండదు. వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

వృషభం: చేపట్టిన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది. వ్యాపారంలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి.

మిధునం: వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

Advertisement

కర్కాటకం: ఇంటా, బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.

సింహం: కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు. రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులు విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

కన్య: వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి విజయం సాధిస్తారు. వ్యాపారపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు

 

తుల: వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. పాత మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.

వృశ్చికం: బంధు మిత్రుల వియోగం భాదను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. సోదరుల ప్రవర్తన వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సమస్యాత్మకంగా సాగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనస్సు: అనుకున్న వ్యవహారాలు సజావుగా సాగవు మిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి.

మకరం: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇంటికీ ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కుంభం: ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి. ఉద్యోగస్తులకు దీర్ఘకాలిక సమస్యలు నుండి కొంత ఊరట కలుగుతుంది. సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు.

మీనం: మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

 

ALSO READ: జన్మజన్మల్లోవెంటాడేకర్మలుఅవేనట – మీరు ఏ కర్మలుచేశారోతెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×