PSL – Cricbuzz: జమ్ము కాశ్మీర్ లోని పహల్గాం లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో… ఆ దేశానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పాకిస్తాన్ దేశాన్ని కరువు ప్రాంతంగా మార్చేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుము కట్టగా… తాజాగా ఆ దేశానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఐపీఎల్ టోర్నమెంట్ కు పోటీగా తీసుకువచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ పై బ్యాన్ పడింది. ప్రముఖ క్రీడా వెబ్సైట్… క్రిక్ బజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన కవరేజ్ మొత్తాన్ని ఆపివేస్తున్నట్లు… తాజాగా ప్రకటించింది స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్ బజ్.
Also Read: Rohit Sharma :హైదరాబాద్ మెట్రోలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ రచ్చ…హిట్ మ్యాన్ అంటూ
PSL 2025 పై బ్యాన్
ప్రకటన విడుదల అయిన క్షణాల్లోనే… ఇప్పటివరకు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన డేటాను కూడా… క్రిక్ బజ్ తొలగించేసింది. దీనికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్ బజ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇండియన్స్ అలాగే క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ కు తగిన శాస్తి చేశారని… ఆ వెబ్ సైట్ ను మెచ్చుకుంటున్నారు. వెల్ డన్, మీరు తోపులు, పాకిస్తాన్ కొంప మునిగింది అంటూ రకరకాల కామెంట్లతో పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్. పాకిస్తాన్ కి నష్టం జరిగేలా అన్ని పనులు చేయండి.. అంటూ మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Threat to Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తామంటూ బెదిరింపులు
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం…. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ కూడా… క్రిక్ బజ్ బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రసారాలు అర్ధాంతరంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
🚨 BIG BREAKING 🚨
👉🏻 SONY SPORTS NETWORK HAVE SUSPENDED PSL 2025 TELECAST IN INDIA DUE TO PAHALGAM TERROR ATTACK 😯
~ What's your take on this 🤔 pic.twitter.com/IfwRoSxfPu
— Richard Kettleborough (@RichKettle07) April 24, 2025
🚨 CRICBUZZ HAS STOPPED THE COVERAGE OF PSL 2025 🚨 pic.twitter.com/WD9BPx0rDc
— Tanuj (@ImTanujSingh) April 24, 2025