BigTV English

Trisha : త్రిష ను దారుణంగా అవమానించిన స్టార్ హీరో.. కఠిన నిర్ణయం..?

Trisha : త్రిష ను దారుణంగా అవమానించిన స్టార్ హీరో.. కఠిన నిర్ణయం..?

Trisha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోలు అందరు సరసన నటించి స్టార్ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి ఈమె చెన్నై బ్యూటీ అయినా కూడా తెలుగులో వరుసగా సినిమాలు చేసే స్టార్ హీరోయిన్ అయింది. తెలుగులో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది త్రిష. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలకు జోడిగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.. ఇలాంటి హీరోయిన్ ను ఓ హీరో దారుణంగా అవమానించాడు.. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలేం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం..


త్రిషను అవమానించిన స్టార్ హీరో..? 

సినీ ఇండస్ట్రీలో త్రిషతో సినిమాలు చేయాలని చాలామంది హీరోలు ఆసక్తి కనపరుస్తుంటారు. త్రిష మాత్రం తనకు కథ నచ్చితేనే సినిమాకు ఒప్పుకుంటూ వస్తుంది. అయితే త్రిష నటించిన సినిమాలన్నిటిలో ఎక్కువ బోల్డ్ సీన్లు ఎక్కడ కనిపించలేదు. చిన్న రొమాంటిక్ సీన్లు తప్ప ఎక్కడ మితిమీరిన శృంగారపు సీన్లలో నటించలేదు. అయితే ఒక స్టార్ హీరోకు మాత్రం త్రిష లిప్ లాక్ సీన్ చేసే అవకాశం ఇచ్చిందంట. కానీ ఆ స్టార్ హీరో మాత్రం త్రిషతో లిప్ లాక్ సీన్ వద్దని, కావాలంటే నేను సినిమానైనా వదులుకుంటానని ఆ స్టార్ హీరో మొహాన్ని చెప్పేశారట.


Also Read : వామ్మో.. ఏంటా రొమాన్స్.. సీరియల్స్‌లో కూడా ఇంత బోల్డా?

ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి, త్రిష కలిసి 96 సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథలో భాగంగా ఓ లిప్ లాక్ సీన్ ఉందట. అయితే త్రిషతో లిప్ లాక్ కు విజయ్ సేతుపతి నో చెప్పారట. దర్శకుడు చెప్పినా కూడా విజయ్ వద్దు అన్నారట. దాంతో మూవీ టీమ్ అవాక్ అయ్యారట. కథ ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది. అలాంటి సినిమాలో లిప్ లాక్ సెట్ కాదు అని ప్రేక్షకులు డిస్ట్రబ్ అవుతారని విజయ్ చెప్పారట. సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న తర్వాత విజయ్ సేతుపతి చెప్పింది నిజమే అని అనుకున్నారట మూవీ టీమ్.

 

విజయ్ సేతుపతి ఏమన్నారంటే..? 

96 మూవీలో రామ్, జాను పాత్రలు ఎంతో భావోద్వేగంగా, చాలా చక్కగా ఉండడంతో లిప్ లాక్ సీన్స్ అస్సలు ఫిట్ కావని భావించారంట. ఇక విజయ్ సేతుపతి చెప్పడంతో టీమ్ మౌనంగా ఉన్నారట.. సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాల స్పందన చూసి విజయ్ సేతుపతి చెప్పింది అక్షరాల నిజం అని యూనిట్ భావించిందట. అలాంటి సీను లేకపోవడం వల్ల సినిమా భారీగా అందుకుందని అంటున్నారు. 18 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో త్రిష హీరోయిన్గా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×