E-Paper
Advertisement

Horoscope Today April 26th : నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు – విందు వినోదాలలో పాల్గొంటారు  

Horoscope Today April 26th : నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు – విందు వినోదాలలో పాల్గొంటారు  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 26న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం : దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది.

Advertisement

వృషభం: కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది.

మిధునం:పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగంలో సానుకూల ఫలితాలుంటాయి.

Advertisement

కర్కాటకం: దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఒక వ్యవహారంలో ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.

సింహం: ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారానికి సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

కన్య: ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఇంట్లో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.

మకరం: ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్ధిక ఇబ్బందుల వలన ఒత్తిడి పెరుగుతుంది.  నూతన రుణ యత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం: ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత రుణాలు తీరుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారంలో భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీనం: నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×