Priyanka Jain: బుల్లితెర నటి ప్రియాంక జైన్.. 2018 లో వచ్చిన చెల్తే చల్తే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు.తన అందం అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు దగ్గర అయింది. ఆమె నవ్వు ఆమె మాట తీరు తో బిగ్బాస్ సీజన్ 7 లో టాప్ ఫైవ్ లో నిలిచారు. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్ తో అందరికీ దగ్గరయింది. ప్రస్తుతం తన ప్రియుడు శివకుమార్ తో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. ఫ్రాంక్ వీడియోలు, లేటెస్ట్ సాంగ్స్ కి రీల్స్ వీడియోలను పోస్ట్ చేస్తారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బిగ్ బాస్ వెళ్లి వచ్చిన తరువాత కొంతమంది సెలబ్రిటీలు టాప్ రేంజ్ కి వెళ్తారు కొంతమందికి అసలు కలిసే రాదు ప్రియాంకకు కలిసి రాలేదని చెప్పొచ్చు. కొత్త ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోకపోయినా, అభిమానులకు దగ్గరగా వుండటానికి వీడియోలను ఇంటర్వ్యూలను ఇస్తూ, వెబ్ సిరీస్ లోను నటిస్తున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన వ్యక్తిగత విషయాలతో పాటు తనకి ఇష్టమైన వ్యక్తి గురించి తెలిపింది. అసలు ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందో చూద్దాం..
ఆ హీరో నాకు చాల ఇష్టం ..
బుల్లితెర నటి ప్రియాంక జైన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, వరస్ట్ క్వాలిటీ రెండు నేను చాలా మంచి దాని లాగా ఉండడమే అని శివకుమార్ తో మౌనరాగం సీరియల్ చేసేటప్పటి నుంచి పరిచయం ఉంది ఇప్పటికే ఆయనతో రిలేషన్ లో ఉన్నానని ఇక ముందు కంటిన్యూగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను అని, వెబ్ సిరీస్, సీరియల్స్, సినిమాల లో ఏది మానేయమన్నా నేను మానేయలేను అని, ప్రతిదీ నాకు చాలా ఇష్టమైంది అని, బ్రతకడం మానేయమంటే మానేలేం కదా అని’ తెలిపింది. అలాగే ఆమె తనకెంతో ఇష్టమైన హీరో గురించి చెబుతూ అక్కినేని నాగార్జున అంటే నాకు ఎంతో ఇష్టమని, ఆయనతో ఒక సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో నాకు కోరిక అని, అది ఎప్పటికైనా జరగాలని నేను కోరుకుంటున్నాను. అవకాశం వస్తే ఆయన తో డేట్ కి వెళ్ళటానికి కూడ రెడీ అని ప్రియాంక జైన్ తెలిపింది. ఈ వీడియో చూసిన వారంతా తన ప్రియుడు శివ కంటే నాగార్జుననే ఇష్టం అని చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయ్యయ్యో శివకుమార్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
కెరియర్ విషయానికి వస్తే ..
సోషల్ మీడియాని వాడడం అందరికీ తెలియకపోవచ్చు కానీ ఈ జంటకు మాత్రం బాగా తెలుసు వారే ప్రియాంక జైన్ శివకుమార్. ఇప్పటికే పలు ప్రాంక్ వీడియోస్ ఫేక్ వీడియోలతో వ్యూస్ ని సంపాదించిన ఈ జంట సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈమె సీరియల్స్ లో నటించేటప్పుడు అచ్చ తెలుగు హీరోయిన్ లా ఉండేది. ఇప్పుడు చూస్తే పూర్తిగా మారిపోయింది. వీరిద్దరూ కలిసి చేసే వీడియోస్ చూసి ఇక మీరు పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ పెట్టేవారు ఉన్నారు. ఏది ఏమైనా ప్రియాంకని ఇష్టపడేవారు ఆమె వీడియోస్ ని సపోర్ట్ చేసేవారు చాలామంది ఉన్నారు అన్నది నిజం. సీరియల్స్ లోకి మళ్లీ రావాలని కోరుకునేవారు ఉన్నారు అభిమానుల కోరిక ప్రకారం త్వరలో మరో తెలుగు సీరియల్తో మన ముందుకు రావాలని కోరుకుందాం.
Sonali: మెగాస్టార్ హీరోయిన్ బుక్ రాసేసిందిరోయ్.. అదే స్పెషాలిటీ