BigTV English

OTT Movie : తాగిన మత్తులో కూతురని కూడా చూడకుండా … ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : తాగిన మత్తులో కూతురని కూడా చూడకుండా … ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ క్లైమాక్స్ కి ఫ్యూజులు అవుట్

OTT Movie : ఓటిటిలో మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఆదరణ పొందుతున్నాయి. దృశ్యం సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన ఇటువంటి సినిమాలు, మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో జోజు జార్జ్ ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు. ఈ మూవీ స్టోరీ నిజజీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఇరట్ట’ (Iratta). 2023లో విడుదలైన ఈ మూవీకి రోహిత్ ఎం.జి. కృష్ణన్ దర్శకత్వం వహించారు. ఇందులో జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేశారు. అంజలి, శ్రీంద, ఆర్య సలీం వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా వాగమన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన, ఒక పోలీస్ అధికారి హత్య చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

వాగమన్ పోలీస్ స్టేషన్లో వినోద్ కుమార్ అనే వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ గా డ్యూటీ నిర్వహిస్తుంటాడు. ఒకరోజు అతని తలకు మూడు బుల్లెట్లు తగిలి చనిపోతాడు. ఈ హత్య సమయంలో స్టేషన్ బయట ఒక పబ్లిక్ ఈవెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ కేసు విచారణ కొంచెం క్లిష్టంగా మారుతుంది. వినోద్ కి ప్రమోద్ అనే ట్విన్ బ్రదర్ ఉంటాడు. అయితే ప్రమోద్ ప్రస్తుతం డిఎస్పీగా విధులు నిర్వహిస్తుంటాడు. ఆల్కహాల్ కి బానిస కావడంతో, భార్య పిల్లలకు దూరంగా ఉంటాడు. ఈ హత్యలో పోలీస్ స్టేషన్లో ఉన్న ముగ్గురు అధికారులు అనుమానితులుగా ఉంటారు. వీరంతా వినోద్ తో కొన్ని కారణాలవల్ల విరోధం పెంచుకుంటారు. కేసు విచారణ చేసినప్పుడు వినోద్ మద్యం మత్తులో, ఒక 17 ఏళ్ల అమ్మాయిని బలవంతం చేశాడని తెలుస్తుంది. నిజానికి ప్రమోద్, వినోద్ బాల్యంలో విడిపోతారు. తల్లిదండ్రుల గొడవల కారణంగా ప్రమోద్ తల్లితో ఉండగా, వినోద్ ని తండ్రి బలవంతంగా తీసుకెళ్లిపోతాడు. ఈ కారణంగా వినోద్, ప్రమోద్ పై కోపం పెంచుకు ని ఉంటాడు. అప్పటినుంచి వాళ్ళతో మాట్లాడకుండా ఒంటరిగానే ఉంటాడు.

వినోద్ తండ్రి ఒక బాలికను వేధించినందున హత్యకు గురవుతాడు. ఇది వినోద్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీరిద్దరూ పోలీస్ ఆఫీసర్లు అయినప్పటికీ, ఇద్దరి జీవితాలు వేరువేరుగా ఉంటాయి. ప్రమోద్ మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నప్పటికీ, భార్యా పిల్లలకు దూరంగానే ఉంటాడు. వినోద్ కిరాతకుడుగా మారుతాడు. అయితే ఇప్పుడు ఈ విచారణలో ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. హత్య జరిగే రోజు వినోద్ ఒక టీవీ షో ని చూస్తూ కూర్చుంటాడు. అయితే అందులో ప్రమోద్ భార్యని టీవీలో చూస్తాడు. ఆమెతోపాటు ఆమె కూతుర్ని కూడా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆమె కూతురు మరి ఎవరో కాదు. మద్యం మత్తులో ఒకరోజు వినోద్ బలవంతం చేసి ఉంటాడు. తన సోదరుడి కూతురు పైన, ఇటువంటి దారుణమైన ఘటనను చేశానని తలుచుకొని బాధపడతాడు. అప్పుడే ఈ ఘటన జరుగుతుంది. చివరికి వినోద్ ని ఎవరైనా చంపారా ? ఆత్మ హత్య చేసుకున్నాడా ? ప్రమోద్ దీనిని ఎలా ఎదుర్కుంటాడు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : ముస్లింలకు వారసత్వంగా హిందూ దేవతల వేషాలు … నేషనల్ అవార్డ్ విన్నర్ తెరకెక్కించిన మస్ట్ వాచ్ మూవీ

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×