E-Paper
Advertisement

Horoscope Today April 3rd : ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు – స్థిరాస్తి వ్యవహారాలలో లాభం

Horoscope Today April 3rd : ఆ రాశి వారికి అనారోగ్య సమస్యలు – స్థిరాస్తి వ్యవహారాలలో లాభం
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్‌ 3న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Advertisement

వృషభం: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మరింత సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

మిధునం: ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి.

Advertisement

కర్కాటకం: నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల ఆగమనంతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

కన్య: దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసి వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనం చేతిలో నిల్వ ఉండదు. చేపట్టిన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు కుటుంబ సభ్యులుతో నిరుత్సాహ పరుస్తాయి. మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

ధనస్సు: నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. .చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.

మకరం: ఉద్యోగాలలో పని తీరుకు తగిన ప్రశంసలు మీరు అందుకుంటారు. ఇంట్లో  శుభకార్యములు నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. కొన్ని వివాదాలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. వ్యాపారంలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మీనం: చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. బంధు మిత్రుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌ 

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×