OTT Movie : దయ్యాలు ఉన్నాయా, లేవా అనే విషయం తెలియదు గానీ, దయ్యాల సినిమాలకు భయపడే వాళ్ళు మాత్రం ఉన్నారు. దయ్యాలు ఎలా ఉంటాయో కూడా సినిమాలలోనే చూస్తున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే దయ్యం మూవీ ఒక బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఆ బొమ్మ ఎక్కడుంటే అక్కడ రక్తపాతం జరుగుతుంది. అందులోని దుష్టశక్తి మనుషుల్ని చంపుతూ ఉంటుంది. చివరి వరకు ఈ స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది జాక్ ఇన్ ది బాక్స్’ (The Jack in the Box). 2019 లో వచ్చిన ఈ మూవీకి లారెన్స్ ఫౌలర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక పాత జాక్-ఇన్-ది-బాక్స్ అనే బొమ్మ చుట్టూ తిరుగుతుంది. ఇది అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుంది. ఇందులో ఏతాన్ టేలర్, రాబర్ట్ స్ట్రేంజ్, లూసీ-జేన్ క్విన్లాన్, ఫిలిప్ రిడౌట్, టామ్ కార్టర్ నటించారు. ఇది దాని యజమానులకు భయంకరమైన పరిణామాలను తెచ్చి పెడుతుంటుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
కేసీ రీనాల్డ్స్ అనే ఒక యువకుడు లండన్ లోని ఒక చిన్న పట్టణంలో నివశిస్తుంటాడు. అతను ఒక మ్యూజియంలో కొత్తగా ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ అతను ఒక పాత, వింతైన జాక్-ఇన్-ది-బాక్స్ బొమ్మను కనుగొంటాడు. దానిని ఒక దాత కొంత కాలం క్రితం మ్యూజియంకు ఇచ్చి ఉంటాడు. ఆ బొమ్మ చూడటానికి జోకర్ లా ఉన్నా, చాలా భయంకరంగా ఉంటుంది. ఈ బొమ్మ ఒక సాధారణ వస్తువు కాదని, దానిలో ఒక దెయ్యం లేదా దుష్ట శక్తి ఉందని త్వరలోనే కేసీకి తెలుస్తుంది. కేసీ ఆ బాక్స్‌ను తెరిచినప్పుడు, దానిలోని దెయ్యం బయటకు వస్తుంది. అది ఆ తరువాత తన విశ్వరూపం చూపిస్తుంది. ఈ ప్రాణం ఉన్న బొమ్మ మ్యూజియంలోని వ్యక్తులను ఒక్కొక్కరిని చంపడం ప్రారంభిస్తుంది. ఇది చూసి దానిని ఎలాగైనా కట్టడి చేయాలనుకుని, ఈ బొమ్మ చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు కేసీ.
కేసీ దాని మూలాలను తెలుసుకుని, దాన్ని ఆపడానికి ఒక మార్గాన్ని కనిపెట్టాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఆ బొమ్మ చీకటి రహస్యాలను, దానిని ఎవరు సృష్టించారో తెలుసుకుంటాడు.కేసీ ఈ దుష్ట శక్తిని ఎదుర్కోవాలి అంటే, అతను తన స్వంత జీవితాన్ని పణంగా పెట్టాల్సి ఉంటుంది. చివరికి ఆ బొమ్మను అంతం చేయడానికి కేసీ ఏం చేస్తాడు? దాని గతం ఏమిటి ? ఆ బొమ్మలో ఉన్న దుష్ట శక్తి ఎవరిది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే. ఈ మూవీ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. భయపెట్టే దృశ్యాలతో ప్రేక్షకులను ఈ సినిమా వణికిస్తుంది. ఒక మంచి హారర్ థ్రిల్లర్ ను చూడాలనుకునేవాళ్ళు ఈ మూవీని చూసేయండి.