Weekly Horoscope : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఏఫ్రిల్ 6 నుంచి ఏఫ్రిల్ 12 వరకు ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం: చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాతో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు పునః ప్రారంభిస్తారు. సంతాన వివాహ శుభకార్యాల పై నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనం కొనుగోలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వృషభం: ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యవహారాలలో సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు అధికారుల సహాయం అందుతుంది. అన్ని రంగాల వారు అంచనాలను అందుకుంటారు. వారం మధ్యన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
మిథునం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి విలువైన బహుమతులు పొందుతారు. కొన్ని పనులలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్ధిరాస్తి సంబంధించి వివాదాల నుంచి బయటపడతారు.
కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కొంత విలువైన సమాచారం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పాత మిత్రులు రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఉద్యోగ విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
సింహం: ధన పరంగా పరిస్థితులు కొంత వరకు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. శుభకార్యాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. నిరుద్యోగులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.
కన్య: ఆలోచనలు ఆచరణలో పెట్టి విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు కొంత వరకు తీరి ఉపశమనం పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు.
ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?
తుల: ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణ పరమైన ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో సమస్యలను పరిష్కరించుకోవడానికి పెద్దల సలహాలు తీసుకుంటారు. భూ సంబంధిత క్రయవిక్రయాలు కొంత అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి.
వృశ్చికం: ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగు పడతాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన గృహం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పద్ధతులను ప్రవేశపెట్టి లాభాలను పొందుతారు.
ధనుస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకొన్న సమయానికి ధనం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో బంధు మిత్రులతో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో మనస్పర్ధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి.
మకరం: ఆదాయమార్గాలు పెరుగుతాయి. రుణాలు కొంత వరకూ తీరుస్తారు. సన్నిహితులతో గృహంలో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా పూర్తవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. బంధువుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. వివాహ ఉద్యోగ యత్నాలు పురోగతి కనిపిస్తుంది. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి.
కుంభం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఆలోచనలు కలిసిరావు. ఇతరులతో చిన్న చిన్న విషయాలకి వివాదాలు కలుగుతాయి. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు మరింత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉంటాయి.
మీనం: చిన్ననాటి మిత్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి బయట పడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఉత్సాహ వాతావరణం ఉంటుంది. ఆలోచనలు ఆచరణలో పెట్టి విజయం సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకుంటారు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు