BigTV English

OTT Movie : ఆచారం పేరుతో పాడు పనులు… వరుస హత్యలు … ట్విస్ట్ లతో దిమ్మతిరిగే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఆచారం పేరుతో పాడు పనులు… వరుస హత్యలు … ట్విస్ట్ లతో దిమ్మతిరిగే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరిస్ లు ఇప్పుడు దూసుకుపోతున్నాయి. ఈ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు. అందాల తార త్రిష నటించిన ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటిటి లో అదరగొట్టింది. వరుస హత్యల కేసులో దాగివున్న రహస్యాలను కనిపెట్టే క్రమంలో ఈ సిరీస్ నడుస్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


‘సోనీ లివ్’ (Sony LIV)

ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘బృంద’ (Brinda). 2024 లో విడుదలైన ఈ సిరీస్ సూర్య మనోజ్ వంగల దర్శకత్వంలో రూపొందింది. ఇందులో త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలో నటించింది. రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, ఇంద్రజిత్ సుకుమారన్, అమని సహాయక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ‘సోనీ లివ్’ (Sony LIV) ప్లాట్‌ ఫామ్‌ లో ఆగస్టు 2, 2024 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో త్రిష తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. 8 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ ఉత్కంఠంగా సాగిపోతుంది. న్యాయం కోసం పోరాడే ఒక మహిళా పోలీసు అధికారి చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది.


స్టోరీలోకి వెళితే

బృంద హైదరాబాద్‌లో ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసర్ గా పనిచేస్తుంది. ఆమె ఒక సిన్సియర్ అధికారిగా పేరు తెచ్చుకుంటుంది. ఆమె ఒకరోజు అందరూ ఆత్మహత్యగా భావించిన ఒక మరణం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంది. తన తెలివి తేటలతో ఈ కేసును డీల్ చేస్తుంది. ఆ తరువాత అది ఆత్మహత్య కాదు, నిజానికి అది హత్య అని ఆమె రుజువు చేస్తుంది. ఇది ఆమెను ఒక సీరియల్ కిల్లింగ్స్ సమూహం లోకి లాగుతుంది. ఇది ఒక హత్య కాదని, ఇందులో చాలా  ఉన్నాయని తెలుసుకుంటుంది. ఈ కేసు విచారణలో భాగంగా, ఆమె సమాజంలో లోతుగా పాతుకుపోయిన మూఢ నమ్మకాలు, ఆచారాలు, తీవ్రవాదాన్ని సవాలు చేసే అనేక రహస్యాలను ఛేదిస్తుంది. ఆచారాల ముసుగులో చిన్నపిల్లలతో కొంతమంది చేసే, హీనమైన పనులను వెలుగులోకి తెస్తుంది.  ఈ సిరీస్ ఆమె వ్యక్తిగత జీవితంలోని అంశాలను కూడా తెలియజేస్తుంది.

ఆమె బాల్యంలోని గాయాలు, కుటుంబ సంబంధాలు ఈ కేసును లోతుగా అనుసంధానం చేసేటట్టు చేస్తాయి. ఆమె సహచరుడు సారథి ఈ విచారణలో ఆమెకు తోడుగా నిలుస్తాడు. అయితే ఆమె స్టేషన్‌లో లింగ వివక్ష, ఉన్నతాధికారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటుంది.అయినా ఆమె పట్టు వదలకుండా ఈ హత్యల వెనుక అసలు నీరస్తులను పట్టుకోవాలి అనుకుంటుంది. చివరికి ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? వారి ఉద్దేశాలు ఏమిటి? ఈ సీరియల్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి? బృంద తన విచారణను ఎలా పూర్తి చేసింది? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్‌లోనూ బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల ద్వారా గతం, వాటి ప్రస్తుత పరిస్థితుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుంది.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×