E-Paper
Advertisement

Horoscope Today December 6th : ఈ రాశివారికి వాహన గండం.. బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్త!

Horoscope Today December 6th : ఈ రాశివారికి వాహన గండం.. బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్త!
Advertisement

Horoscope  December 06 :  గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 6న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.

Advertisement

వృషభ రాశి:  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

మిథున రాశి: ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

Advertisement

కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

సింహ రాశి:  నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు వస్తాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య రాశి:  అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయటపడతారు.

తులా రాశి: కళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

వృశ్చిక రాశి:  ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు రాశి: సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో  నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

మకర రాశి:  ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

కుంభ రాశి:  నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.  చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

మీన రాశి:  ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×