BigTV English

Shampoo: జుట్టుకు షాంపూ ఎక్కువగా వాడుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Shampoo: జుట్టుకు షాంపూ ఎక్కువగా వాడుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Shampoo: జుట్టు నల్లగా, మందంగా , బలంగా మారాలని ఎవరు కోరుకోరు చెప్పంగి. జుట్టు దృఢంగా, నల్లగా మారడానికి చాలా మంది అనేక ఆయిల్స్‌తో పాటు షాంపూలను కూడా వాడుతుంటారు. అంతే కాకుండా ఇందు కోసం అనేక హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి.


జుట్టును సరిగ్గా శుభ్రంగా ఉంచుకుంటే అది మరింత దృఢంగా మారుతుంది. అందుకే చాలా మంది జుట్టు యొక్క మురికిపోవడానికి ఎక్కువ షాంపూను కూడా ఉపయోగిస్తారు. ఎక్కువ షాంపూని ఉపయోగించడం ద్వారా జుట్టు శుభ్రం చేయబడినప్పటికీ, ఇది జుట్టుపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. షాంపూ ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టు తేమను తగ్గిస్తుంది:


మీరు సల్ఫేట్‌లు , పారాబెన్‌లతో కూడిన షాంపూలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే, అవి జుట్టు , స్కాల్ప్‌లోని సహజ తేమను తొలగిస్తాయి. దీనివల్ల జుట్టు పొడిగా మారుతుంది. అంతే కాకుండా నిర్జీవంగా తయారవుతుంది. మీరు షాంపూని ఉపయోగిస్తుంటే కనక అందులో సల్ఫేట్లు , పారాబెన్లు లేకుండా ఉండాలి. ఈ రసాయనాలు ఉన్న షాంపూలను వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అంతే కాకుండా జుట్ట రాలే అవకాశాలు కూడా ఉన్నాయి.

దురద:
ఎక్కువగా షాంపూ వాడటం వల్ల స్కాల్ప్ చర్మం చాలా పొడిగా మారుతుంది. ఇది దురద , చుండ్రు సమస్యలను కలిగిస్తుంది. కొన్నిసార్లు ఈ దురద చాలా పెరిగి రక్తస్రావం కూడా అవుతుంది. ఇలాంటి షాంపూని ఉపయోగించకుండా ఉండండి. ఇది స్కాల్ప్ పొడిగా మారుతుంది.

వెంట్రుకలు బలహీనంగా మారతాయి:
షాంపూని తరచుగా అప్లై చేయడం వల్ల జుట్టు యొక్క బయటి పొర దెబ్బతింటుంది. షాంపూతో మీ జుట్టును వారానికి మూడు సార్లు మాత్రమే వాష్ చేయాలి. కొందరు ప్రతి రోజు తలస్నాం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు రాలే ప్రమాదం ఉంటుంది. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

సహజ నూనె బ్యాలెన్స్ కోల్పోవచ్చు:
ప్రతి ఒక్కరి జుట్టు సహజ నూనెను కలిగి ఉంటుంది.ఇది వాటిని రక్షిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు పోషణను ఇస్తుంది. అధికంగా షాంపూ చేయడం వల్ల ఈ పొర తొలగిపోతుంది. దీని వల్ల స్కాల్ప్ చాలా పొడిగా , జిడ్డుగా మారుతుంది.అంతే కాకుండా జుట్టు చాలా బలహీనంగా తయారవుతుంది.

జుట్టు రంగు మారడం:
మీరు జుట్టుకు కలర్ పెట్టుకున్నట్లయితే తరచుగా షాంపూ చేయడం వల్ల మీ జుట్టు రంగు మారుతుంది. దీంతో పాటు, ఎక్కువ షాంపూ చేయడం వల్ల జుట్టు రంగు  తగ్గుతుంది. జుట్టుకు రంగు వేేసుకునే వారు ఎక్కువగా షాంపూ వాడకపోతే బెటర్.

Also Read: ఇవి వాడితే.. మీ జుట్టు అస్సలు రాలదు తెలుసా ?

ఈ విషయాలను గుర్తుంచుకోండి:
మీ జుట్టు పొడిగా లేదా సాధారణంగా ఉంటే, వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే షాంపూ చేయండి. వీలైతే, తేలికపాటి లేదా సల్ఫేట్ లేని షాంపూని ఉపయోగించండి. జుట్టు తేమగా ఉండేలా ఎల్లప్పుడూ షాంపూతో కండీషనర్ ఉపయోగించండి. జుట్టు అవసరాలు , స్కాల్ప్ రకం ప్రకారం షాంపూని ఎంచుకోండి.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×