E-Paper
Advertisement

Horoscope Today December 10th :  ఆ రాశి వారికి ఇవాళ ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది

Horoscope Today December 10th :  ఆ రాశి వారికి ఇవాళ ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 10న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగాసాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నెలకొన్న  సమస్యలు అధిగమిస్తారు.

Advertisement

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు తప్పవు. ఆరోగ్య విషయంలో  శ్రద్ధ అవసరం. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు అంతగా రాణించవు. వ్యాపారంలో కీలక సమయంలో నిర్ణయాలు తీకోలేరు.

మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు  ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. నిరుద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

Advertisement

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఇవాళ  బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన పనులలో అవరోధాలు ఏర్పడినా.. అధిగమించి ముందుకు సాగుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో  ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు  కీలక సమయంలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది.

కన్యారాశి: ఈ రాశి వారికి ఈరోజు  దీర్ఘ కాలిక రుణ బాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్థులకు పై అధికారుల  అనుగ్రహం కలుగుతుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి:   ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు. ఆత్మ విశ్వాసంతో వివాదాల నుంచి బయట పడతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదురైనా అధిగమించి లాభాలు అందుకుంటారు.

ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు ఇతరుల వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదు. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. చేపట్టిన పనులు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు మరింత బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సాగుతాయి. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సమస్యాత్మకంగా ఉంటుంది.

 

మకర రాశి: ఈ రాశి వారు ఈరోజు  చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దాయాదుల తో భూ సంభందిత వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో నెలకొన్న  వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు  చేపట్టిన పనులు నత్త నడక సాగుతాయి.  వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారంలో  భాగస్తులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో  అధికారులతో వివాదాలు కలిగే సూచనలున్నవి.

మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు  అనారోగ్య ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ఇతరుల సహయ సహకారాలు అందుతాయి. ధనదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×