Intinti Ramayanam Today Episode December 10th : నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ మందుని అవని తాగినట్టు యాక్ట్ చేస్తుంది. ఏంటి మందు మీరు తాగితే తప్పులేదు నేను తాగితే తప్ప అనేసి అవని అక్షయ్ కి షాకిస్తుంది. అవని తన మీద అనుమాన పడుతున్నాడని అక్షయ్కి చెప్తుంది. నా భర్త నన్ను కొడుతున్నాడని నన్ను తిడుతున్నాడని నామీద అనుమానంతో నన్ను దూరం పెడుతున్నాడని మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అనేసి బయటకు వెళ్తానని అంటుంది. ఇలా అరవకు అరిస్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు బాగోదు నువ్వు తాగేవని తెలిస్తే ఇంక ఇంట్లో అస్సలు ఊరుకోరు అనేసి అక్షయ్ అవనీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అవనీ నిజంగానే ఏం తప్పు చేయలేదని తన అమ్మ తమ్ముడిని కలవడానికి వెళ్లానని చెప్తుంది అయినా అక్షయ్ నమ్మడు.. తాగేసి ఏదేదో వాగుతుంది అని చెప్పేసి మొహం మీద నీళ్లు కొడతాడు.. అలాగే వెళ్లి మజ్జిగ తీసుకుని వచ్చేస్తాడు. కమల్ కింద పడిపోవడంతో ఇక డాక్టర్ వచ్చి అతనికి ఇంజక్షన్ చేస్తాడు. ఇక అందరూ ఈ టైంలో ఎందుకురా ఎక్సర్సైజులు చేసావు అనేసి అడుగుతారు. డాక్టర్ వెళ్లిపోగానే పల్లవిని చూసుకోమని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు బావ అని పల్లవి అడుగుతుంది. రాజేంద్రప్రసాద్ బోర్డ్ మెంబర్స్ తో మీటింగ్ పెట్టి ఉంటాడు. కమల్ ని అందరూ చిన్న బాసని పిలుస్తారు. ఇక మీటింగ్ జరుగుతున్న సమయంలో రాజేంద్రప్రసాద్ కు మైల్డ్ స్టోక్ వస్తుంది. ఇక అక్షయ్ కమల్ ఇద్దరూ రాజేంద్రప్రసాద్ను హాస్పిటల్ కి తీసుకొస్తారు. మైల్డ్ స్ట్రోక్ అండి ఏం కాలేదు అనేసి చెప్తారు డాక్టర్. మైల్డ్ స్ట్రోక్ అంటే ఇక మీదట పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి అనేసి డాక్టర్ చెప్తాడు. ఇక రాజేంద్రప్రసాద్ నీ ఇంటికి తీసుకుని వెళ్తారు. ఈ వయసులో కూడా మీరు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదనేసి అందరూ అంటారు ఇక రాజేశ్వరి చక్రధర్లు కూడా రాజేంద్రప్రసాద్ ని చూడడానికి ఇంటికి వస్తారు. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను రేపు బిజినెస్ లు అన్నిటికీ చైర్మన్గా అక్షయ్ ఉంటాడు అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. రేపే అధికారికంగా మీటింగ్ పెట్టేసి ఈ విషయాన్ని ప్రకటిస్తాననేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. రాజేంద్రప్రసాద్ నిర్ణయాన్నికి అందరూ సంతోషపడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ మీ చైర్మెన్గా ప్రకటించడంపై ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. మీ బిజినెస్ లోనే చూసుకోవడానికి అక్షయ్ మంచివాడే అనేసి అంటారు. ఇక పల్లవి కూడా తన మీద ఎటువంటి అనుమానం రాకుండా ఉండాలని కంగ్రాట్స్ బావగారు మీరు చైర్మన్ కాబోతున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఓ మాట అంటుంది. చక్రధర్ కోపంగా ఉంటాడు. ఆ అక్షయ్ గాడు చైర్మన్ అయితే నీ భర్త ఫ్యూన్ గా ఉండాల్సి వస్తుంది ఆ మాత్రం నీకు లేదా కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్తున్నావ్ అనేసి అరుస్తాడు. మైండ్ లో ఆల్రెడీ ప్లాన్ మొదలైంది డాడ్ ఆ విషయం ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలని పల్లవి చక్రధర్ తో అంటుంది. ఇక అక్షయ్ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి, నానమ్మ చాలా కంగారుపడుతుంది నాన్న అనేసి అడుగుతాడు. ఆ మాత్రం కంగారు పడుతుంది కదా అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని అమ్మకు కంగారుగానే ఉంటుంది అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. మరి శ్రీకర్ దూరంగా ఉంటే అమ్మ మనసు కూడా అలానే ఉంటుంది కదా శ్రీకర్ని ఇంటికి రమ్మని చెబుదాం నాన్న అనేసి అంటాడు. వాడండి నిజంగానే మీకు ప్రేమ లేదా చెప్పండి అనగానే నాకు వాడంటే ఎటువంటి ప్రేమ లేదు అని అక్షయ్ కు షాకిస్తాడు.
ఇక అక్షయ్ బెడ్రూంలో అంతా వెతుకుతూ ఉంటాడు. అవని ఏం వెతుకుతున్నారు చెప్పు అంటే మీలాంటి ఆడవాళ్లు ఉంటే మనశ్శాంతి కరువైంది అద్దం ముక్కలైతే ఎటు చల్లారిగా వెళ్లిపోతాయి అలాగే నా మనసు కూడా ముక్కలైంది అందుకే వెతుక్కుంటున్నా అనగానే మీకు కావాల్సింది ఇదే కదా అనేసి అవి లాప్టాప్ తెచ్చి ఇస్తుంది. ఇక పార్వతీ అక్కడికి వచ్చి మీ నాన్న తర్వాత బాధ్యతలు తీసుకుంటున్నావు? నీ తమ్ముల విషయం మర్చిపోవద్దు. శ్రీకర్ తెలివైన వాడే. కమల్ రేపు మాకు తండ్రి కాబోతున్నాడు వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అనేసి అంటుంది. తండ్రి తర్వాత తండ్రి స్థానంలోకి వస్తున్నాను అమ్మ వాళ్ల గురించి నేను బాగానే చూసుకుంటాను. నువ్వేం దిగులు పెట్టుకోవద్దని అక్షయ్ అంటాడు. కమల్ ఆరాధ్య డాన్సులు వేస్తారు మధ్యలో బామ్మా వచ్చి ఎందుకురా డాన్సులు అనగానే అన్నయ్య చైర్మన్ కాబోతున్నందుకు సంతోషంతో డాన్సులు వేస్తున్నామనేసి అంటాడు. స్వీట్లు కూడా తెప్పించి అందరికీ ఇస్తాడు కమల్. ఇక ఉదయం లేవగానే పల్లవి ఆఫీస్ కి వెళ్తుంది. అప్పుడే అవని కూడా వస్తుంది. నా భర్త చైర్మన్ అవుతుంటే రాకుండా ఎలా ఉండాలి అనగానే పల్లవి కూడా బావగారి చైర్మన్ అవుతుంటే చూడాలని ఉంది అందుకే వచ్చాను అనేసి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..