BigTV English

Horoscope  Today December 11th : ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి –  ఆ విషయంలో జాగ్రత్త

Horoscope  Today December 11th : ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి –  ఆ విషయంలో జాగ్రత్త

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 11న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి: ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాభివృద్దికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి: ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన వస్తు వాహన లాభాలున్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది.


మిధున రాశి: ఈ రాశి వారు ఇవాళ చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. రుణ ఒత్తిడి పెరగడం వల్లన  మానసిక ప్రశాంతత ఉండదు. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటా బయటా నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విషయమై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి.

సింహ రాశి:  ఈ రాశి వారు ఇవాళ ఇంటా బయట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతానం, విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పదవులను పొందుతారు.

కన్యారాశి: ఈ రాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖుల పరిచయాలు లభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలుకు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పై అధికారుల ఆదరణ పొందుతారు.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

 

తులారాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో  ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో తొందరపాటు వలన గందరగోళ పరిస్థితులుంటాయి. మిత్రుల నుంచి ఊహించని రుణ ఒత్తిడి కలుగుతుంది. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విషయాలలో భాగస్థులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

 ధనస్సు రాశి: ఈ రాశి వారు ఈరోజు తమ అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి వివాదాలకు సంభందించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారంలో సమస్యలను పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక కష్టం తో స్వల్ప ఫలితం పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి.  దీర్ఘ కాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులు తో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతవరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీనరాశి: ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో పూర్తవుతాయి. బంధువర్గంతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంట బయట చికాకులు పెరుగుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

 

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×