Pushpa 2 Day 6 Collections : ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. తమ అభిమాన హీరో నటించిన పుష్ప 2 ను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. మొత్తానికి ఈ మూవీ ఇటీవలే థియేటర్లలోకి వచ్చేసింది. ఆరు రోజుల క్రితం వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్‌లు వంటి ప్రముఖులు నటించిన మూవీ పుష్ప2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడేళ్ల తర్వాత పుష్పరాజ్ మ్యాజిక్ చేశాడు.. అందుకే సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చి పడుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఆరు రోజులకు ఎన్ని కోట్లు కలెక్షన్స్ ను రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
పుష్ప పార్ట్ 1 లో కొనసాగిన కథతో మూవీ వచ్చిన సంగతి తెలిసిందే.. అప్పుడు ఎర్ర చందనం స్మగ్లింగ్, ఇప్పుడు సిండికేట్‌తో పాటు రాజకీయాలను కూడా శాసించాడు.. రాజకీయ నేతలకు సపోర్ట్ గా నిలిచి విలన్ల కు టార్గెట్ అయ్యాడు.. భన్వర్ సింగ్ షెకావత్‌పై ఎలా పై చేయి సాధించాడు? ఎన్నో అంచనాల మధ్య రిలీజైన పుష్ప 2ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. ప్రమోషన్ కార్యక్రమాలు మొత్తం కలిపి దాదాపు రూ. 500 కోట్లవరకు బడ్జెట్ ను పెట్టారు. ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగపతి బాబు, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ కావడంతో పాటు రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్, టీజర్, అల్లు అర్జున్ లుక్ అన్నీ పుష్ప 2పై అంచనాలను భారీగా పెంచేసింది. ఇందుకు తగినట్లుగానే పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది.. రిలీజ్ కు భారీగా వసూల్ చేసిందని వార్తలు వినిపించాయి.. ఇప్పుడు రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఆరు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూల్ చేసిందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
పుష్ప 2 మూవీ రూ. 1200 కోట్ల గ్రాస్ , రూ. 620 కోట్ల షేర్ లక్ష్యంగా పుష్ప 2 బరిలో దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 11000 వేల స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు మేకర్స్. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్మురేపిన పుష్ప 2 ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. మొదటి రోజు 180 కోట్లు, రెండో రోజు 292 కోట్లు, మూడో రోజు 449, నాలుగో రోజు 700 పైగా, ఐదో రోజు 821 కోట్లు, ఆరో రోజుకు గాను 1000 కోట్లకు చేరువలో రాబట్టిందని మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. యూఎస్ మార్కెట్ నుంచే 10 మిలియన్‌లకి పైగా వసూళ్లు అంటే రూ.84 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా మిగతా ఓవర్సీస్ దేశాల్లో కలిపి 9 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టిందట. అంటే 76 కోట్లకి పైగా గ్రాస్ అందుకుంది పుష్ప 2. ఇలా కేవలం 5 రోజుల్లోనే పుష్ప ఒక్క ఓవర్సీస్ మార్కెట్ నుంచే దాదాపు రూ.150 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుందని టాక్ వినిపిస్తుంది.. ఇలానే కొనసాగితే మాత్రం మరో వారంలో 1500 కోట్లు పక్కాగా అందుకుంటుందని తెలుస్తుంది..