Manchu Manoj: మంచు ఇంటి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు రోడ్డెక్కాయి. మంచు మనోజ్ – మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అసలు ఇద్దరు అన్నదమ్ముల మధ్య అంత గొడవలు రావడానికి కారణం ఏంటి.. ? ఇద్దరు మోహన్ బాబుకు సొంత కొడుకులే కదా.. అనుకుంటే అవును ఇద్దరు మోహన్ బాబుకు సొంత కొడుకులే.. కానీ తల్లులు వేరు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఏరోజు ఈ ముగ్గురు పిల్లలు.. తల్లులు వేరు అనేవిధంగా పెరగలేదు.
మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి. వీరికి ఇద్దరు పిల్లలు.. మంచు లక్ష్మీ, మంచు విష్ణు. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఆమె అనారోగ్యం పాలయ్యారు. ఇక ఆమెను చూసుకోవడానికి ఆమె చెల్లెలు నిర్మలా దేవి వచ్చింది. ఇక ఇద్దరు పిల్లలను విద్యాదేవి చెల్లెలు చేతిలో పెట్టి కన్నుమూసింది. ఆ తరువాత మరదలినే మోహన్ బాబు పెళ్లాడాడు. వారికి పుట్టిన కుమారుడే మనోజ్. ముగ్గురు పిల్లలు చిన్నతనం నుంచి ఒక తల్లి దగ్గర పెరగడంతో ఎవరు మనోజ్ ను సవతి కొడుకుగా చూడలేదు. అలానే మోహన్ బాబు సైతం ముగ్గురు పిల్లలను సమానంగా పెంచాడు.
ఇక విష్ణు, లక్ష్మీ కూడా ఏరోజు మనోజ్ ను సవతి తమ్ముడుగా చూసింది లేదు. అయితే అంతా ఒకేలా ఉండదు.. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాకా.. పెళ్లిళ్లు అయ్యాకా తల్లిదండ్రుల మాట కంటే భార్యల మాటనే ఎక్కువ వింటారు. ఇప్పుడు మనోజ్ కూడా అదే చేశాడని మోహన్ బాబు అంటున్నాడు. మనోజ్ కు మొదట ప్రణతితో మోహన్ బాబు పెళ్లి చేశాడు. కానీ, ఈ బంధం ఎంతోకాలం నిలబడలేదు. విడాకులు ఇచ్చేశాడు. అక్కడి నుంచే మనోజ్ కు మోహన్ బాబు కు మధ్య గొడవలు మొదలయ్యాయి.
తల్లి నిర్మల సైతం.. భర్త పక్కనే నిలబడింది. కానీ, కొడుకును వదలలేదు. భర్తకు ఎంతోకొంత నచ్చజెప్పి కొడుకును ఇంట్లోనే ఉంచుతూ వచ్చింది. ఆ సమయంలోనే మనోజ్.. భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. ఆమెను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు ఫ్యామిలీకి అస్సలు నచ్చలేదు. తన ప్రేమ విషయంలో మనోజ్ చాలా కష్టపడ్డాడు. ప్రేమలో ఉన్నప్పుడు మనోజ్ ఫ్యామిలీ.. చాలా సీరియస్ అయ్యారని, చంపడానికి కూడా ప్రయత్నించారని, తాము పారిపోయి ఏడాది మొత్తం రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నామని మనోజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అప్పుడు కూడా తల్లి నిర్మల, అక్క లక్ష్మీనే మోహన్ బాబును ఒప్పించి వారి పెళ్లి జరిపించారు.
ఇక ఆస్తుల పంపకం విషయంలో ఏ తల్లి అయినా తన కొడుకుకు ప్రత్యేకంగా ఇవ్వాలని గొడవ చేస్తూ ఉంటుంది. కానీ, ఈ విషయంలో మాత్రం నిర్మల తప్పు చేసిందని తెలుస్తోంది. భర్త ఏది చెప్తే అది చేయడం తప్ప ఏమి తెలియని ఆమె.. కొడుకు అన్యాయం చేయడని నమ్మి అంతా వారిపైనే నమ్మకం ఉంచింది. మనోజ్ తాగుడుకు బానిస అయ్యాడని మోహన్ బాబు చెప్పాడు. కానీ, అంత బానిస అయ్యేవరకు మోహన్ బాబు ఏం చేస్తుంది..? తల్లి కూడా మనోజ్ ను ఆపేలేకపోయిందా.. ? అనే అనుమానాలు వస్తున్నాయి.
మొదటి నుంచి మనోజ్ కు తల్లి నిర్మలకు మధ్య మంచి అనుబంధం ఉంది. అలాంటింది తన తల్లికి మనోజ్ అన్ని చెప్పినా.. ఆమె ఏమి చేయలేకపోయిందా.. ? కొడుకు పడే బాధలు చూడలేక ఆమె అనారోగ్యం పాలయ్యిందా.. ?లేక ఈ గొడవల వలన అనారోగ్యం పాలైందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఆమె త్వరగా కోలుకొని బయటకి వచ్చి కొడుకుకు సపోర్ట్ గా నిలబడుతుందేమో చూడాలి.