E-Paper
Advertisement

Horoscope  Today December 15th : ఆ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది.   

Horoscope  Today December 15th : ఆ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది.   
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 15న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు  చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధన పరంగా చేసే ప్రయత్నాలు కలసి రావు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో  ట్రాన్స్ఫర్ అయ్యే   సూచనలున్నవి. ఇతరులతో విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసివస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారు ఈరోజు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయట పడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంభంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో అధికారుల సహాయం లభిస్తుంది.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. సంతాన పరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.

కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి సంబందిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

తులా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తికావు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు  దూర ప్రాంత బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యములు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్దులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు.

కుంభ రాశి :  ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఇంట బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.  వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయ్యుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. పాత మిత్రులతో విహారయాత్రలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

 

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×