Bigg Boss Telugu winner’s List: పాశ్చాత్య దేశాలలో ‘బిగ్ బ్రదర్’ పేరిట ప్రారంభమైన ఒక రియాల్టీ షో ని హిందీలో తొలిసారి ‘బిగ్ బాస్’ అంటూ 2007లో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ షో కి భాషతో సంబంధం లేకుండా ప్రజాధారణ పెరగడంతో ప్రతి భాషలలో కూడా ఈ షోని నిర్వహించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే హిందీలో ప్రారంభమైన పదేళ్లకు అంటే 2017లో తెలుగులో తొలిసారి బిగ్ బాస్ సీజన్ వన్ ప్రారంభం అయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఈ షో కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ షో మొదలైనప్పటి నుంచి ఎవరెవరికి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే డిస్కషన్ ఎక్కువగా నడుస్తుంది. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో ఏడు సీజన్ లు కంప్లీట్ చేసుకోగా..ఆయా సీజన్లలో ఎవరు విన్నర్? ఎవరు రన్నర్? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈసారి ఈ విన్నర్స్ జాబితాలోకి సీజన్ 8 నుండి ఎవరు చేరబోతున్నారు అనే విషయం కూడా ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 1:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తొలిసారి ప్రారంభమైన షో ఇది. 2017 సెప్టెంబర్ 24న గ్రాండ్ ఫినాలే జరిగింది. ఈ సీజన్ విన్నర్ శివ బాలాజీ (Siva balaji). ఒకప్పుడు హీరోగా చేసిన ఈయన.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. మరోవైపు ఆదర్శ్ బాలకృష్ణ (Adharsh Balakrishna) రన్నర్ గా నిలిచారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 2:
ఇకపోతే బిగ్ బాస్ రెండవ సీజన్ కి హోస్ట్ మారారు. ఎన్టీఆర్ బదులు నాని హోస్ట్ గా వ్యవహరించారు.ఆ సీజన్ 112 రోజులు సాగింది. 2018 జూన్ 10న మొదలైన ఈ షో సెప్టెంబర్ 30న ముగిసింది. అందులో కౌషల్ మండ (Kaushal manda)విజేతగా నిలవగా, సింగర్ గీతామాధురి(Geetha Madhuri) రన్నర్గా నిలిచారు. అంతేకాదు ఈ షో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. నానిని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 3..
బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయడం ప్రారంభించారు. ఇక ఇప్పటినుంచి ఇప్పటివరకు ఆయనే కంటిన్యూ అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 జూలై 21 2019లో మొదలై, 2019 నవంబర్ 3న ముగిసింది. ఈ షో కి ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipliganj) విజేతగా నిలవగా.. ఫేమస్ యాంకర్ శ్రీముఖి(Sreemukhi )రన్నర్గా నిలిచారు
బిగ్ బాస్ సీజన్ 4..
2020 సెప్టెంబర్ 6న సీజన్ 4 ప్రారంభం అయింది. 105 రోజులపాటు సాగిన ఈ షో 2019 డిసెంబర్ 20న ముగిసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా హీరో అభిజిత్(Abhijith )విన్నర్ గా నిలవగా, అఖిల్ సార్ధక్(Akhil sarthak)రన్నర్ గా నిలిచారు. ప్రస్తుతం వీరు టీవీ షోలు చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5..
బిగ్ బాస్ సీజన్ 5కి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే అప్పటివరకు సినిమా సెలబ్రిటీలు లేదా పాపులర్ సింగర్స్, క్రేజ్ ఉన్న నటులు మాత్రమే విన్నర్ అయ్యేవారు. కానీ ఐదో సీజన్లో వీ.జే.సన్నీ (V.J.Sunny)కి ట్రోఫీ లభించింది. టీవీ యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన విజేతగా నిలిచి రికార్డు సృష్టించారు. రన్నర్ గా షణ్ముఖ జశ్వంత్ ((Shanmukh Jashwanth)నిలిచారు. సెప్టెంబర్ 5 2021లో ప్రారంభమై, 2011 డిసెంబర్ 19న కార్యక్రమం ముగిసింది
బిగ్ బాస్ సీజన్ 6.
2022 సెప్టెంబర్ 4న ప్రారంభమై, 2022 డిసెంబర్ 18న ముగిసిన ఈ సీజన్లో సింగర్ ఎల్వీ రేవంత్(L.V
revanth )విన్నర్ కాగా, యూట్యూబర్ శ్రీహాన్ (Shrihan ) రన్నర్ గా నిలిచారు.
బిగ్ బాస్ సీజన్ 7.
గత ఏడాది బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth)విజేతగా నిలవగా.. ఫేమస్ సీరియల్ ఆర్టిస్ట్ అమర్దీప్ చౌదరి (Amardeep chowdhury) రన్నఆర్ గా నిలిచారు .
బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు ?
ఇకపోతే నిఖిల్, గౌతమ్ ఇద్దరూ కూడా పోటాపోటీగా దూసుకుపోతున్నారు. విన్నర్ గౌతమ్ లేదా నిఖిల్ అవుతారని లీకులు కూడా వస్తున్నాయి.మరి ఎవరు విజేతగా నిలుస్తారు? ఎవరు ఈ బిగ్ బాస్ విన్నర్స్ జాబితాలోకి చేరిపోతారో? చూడాలి.