BigTV English

Venu Swamy prediction: జైలుకు వెళ్తే చాలు.. సీఎం అవుతారట.. మీరూ ట్రై చేస్తున్నారా!

Venu Swamy prediction: జైలుకు వెళ్తే చాలు.. సీఎం అవుతారట.. మీరూ ట్రై చేస్తున్నారా!

Venu Swamy prediction: మీకు సీఎం కావాలని ఉందా.. అయితే ప్రజల ఓట్లతో పని లేదు. ఎమ్మేల్యేలు అవసరం లేదు. జస్ట్ ఏదైనా కేసులో జైలుకు వెళ్లొస్తే సరి. మీ సీఎం కావాలన్న ఆకాంక్ష నెరవేరినట్లే. ఇటీవల సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ గా మారింది. జైలుకు వెళ్ళిన వారంతా.. సీఎం లు అవుతున్నారట. ఈ మాటలన్నది ఎవరో కాదు ఏకంగా ప్రముఖ జ్యోతిష్కులు వేణు స్వామి. ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి మాటలు చెప్పారో లేదో కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పుణ్యమా అంటూ ఆ మాటలు వైరల్ గా మారాయి.


ఇటీవల వివాదాస్పద అంశాలపై దృష్టి సారించని వేణు స్వామి, పొలిటికల్ పరంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ వీడియో ఆధారంగా, జైలుకు వెళ్లొచ్చిన అల్లు అర్జున్ సీఎం కావడం ఖాయమంటూ చెప్పేశారు వేణుస్వామి. అందులో కూడా జైలుకు వెళ్లొచ్చారుగా ఇక నెక్స్ట్ సీఎం అన్నారు. ఇలా జైలుకు వెళ్లొచ్చి సీఎంలైన మన తెలుగు వారి చరిత్ర చూస్తే.. జగన్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు పేర్లు మనకు వినిపిస్తాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలులో ఉన్నారు. అంతేకాదు జైలు నుండి బయటకు వచ్చాక ఓదార్పు యాత్ర చేపట్టారు. పార్టీని స్థాపించి, ప్రజల్లోకి వెళ్లారు. అప్పుడు క్యాడర్ ను కూడా బలోపేతం చేసుకున్నారు. ఆ తర్వాత వైఎస్సార్ పై ఉన్న అభిమానం ఎన్నికల్లో ప్రభావం చూపగా సీఎం అయ్యారు. ఇక ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జైలు చరిత్ర చూస్తే.. ఇంటిలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.


స్వయంగా తన కుమార్తె పెళ్లి వేడుకకు కూడా దూరంగానే ఉన్నారు. ఒక్కరోజు అలా వచ్చి, తన బిడ్డను ఆశీర్వదించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేపట్టారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలపై పోరాటాలు సాగించారు. చివరకు ప్రజల మనస్సులు గెలిచారు. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా రేవంత్ రెడ్డి కృషిని గుర్తించారు. తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి భాద్యతలు చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం ప్రజాపాలన సాగిస్తున్నారు.

ఇక ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబుకు సుధీర్ఘ రాజకీయ చరిత్ర సొంతం. ఆయన మూడు పర్యాయాలు సీఎం గా ఉన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జైలుకు వెళ్లారు చంద్రబాబు. ఆయన అరెస్ట్ ఒక సంచలనమే. కానీ బెయిల్ పై బయటకు వచ్చారు. అప్పటికే బాబు కుమారుడు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. జైలులో ఉన్నప్పుడే జనసేన అధినేత పవన్ చేతులు కలిపారు. బీజేపీ కూడా మద్దతిచ్చింది. ఇంకేముంది రాష్ట్ర వ్యాప్త పర్యటన సాగించిన చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. అప్పటికే పలు దఫాలు సీఎంగా భాద్యతలు నిర్వర్తించిన చంద్రబాబు, మరోమారు సీఎం అయ్యారు.

ఈ ముగ్గురు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. జైలు అనేది వీరి జీవితంలో అనూహ్యంగా వచ్చింది. వీరు మాత్రం రాజకీయ రంగంలో తమరేంటో నిరూపించుకొని ప్రజల మద్దతు కూడగట్టుకున్న నేతలు. కానీ వేణు స్వామి మాటలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లే. జైలుకు వెళ్తే చాలు సీఎం అవుతారనే రేంజ్ లో మాట చెప్పేశారు. అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లొచ్చారుగా. ఇక నెక్స్ట్ సీఎం అవుతారంటూ చెప్పడం విశేషం. ఇప్పటికే తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ జైలుకు వెళ్లాలని తెగ తాపత్రయ పడుతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. జైలుకు వెళితే సానుభూతి పనిచేస్తుందని బీఆర్ఎస్ భావనగా కాంగ్రెస్ తెలుపుతోంది.

Also Read: Revati Daughter – Allu Arjun: ఆ పసి హృదయం ఎదురుచూస్తోంది.. అమ్మ ఊరికెళ్లిందని.. రేవతి ఇంట ఇదీ పరిస్థితి

కానీ సీఎం కావాలంటే ప్రజల మెప్పు కావాలి. పార్టీని ఒకే తాటిపై నడిపించాలి. ఎమ్మేల్యేలను గెలిపించుకోవాలి. ఆ తర్వాత వారి మద్దతుతో సీఎం అవ్వాలి. ఇంత తతంగం తెలిసి కూడా వేణు స్వామి, ఏకంగా అల్లు అర్జున్ సీఎం అవుతారంటూ చెప్పడం మరింత హాస్యాస్పదంగా ఉందంటూ నెటిజన్స్ తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. మరి వీటికి వేణుస్వామి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి!

Related News

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Big Stories

×