E-Paper
Advertisement

Horoscope  Today December 16th : ఆ రాశి వారు ఇవాళ చేపట్టిన వ్యవహారాలలో అఖండ విజయం సాధిస్తారు

Horoscope  Today December 16th : ఆ రాశి వారు ఇవాళ చేపట్టిన వ్యవహారాలలో అఖండ విజయం సాధిస్తారు

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 16న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి: ఈరాశి వారు ఈరోజు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

వృషభ రాశి: ఈరాశి వారికి ఈరోజు ఇంటా బయట పరిస్థితులు కొంత నిరుత్సాహ పరుస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తికావు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్య పరుస్తుంది. అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు.

మిధున రాశి: ఈరాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటక రాశి: ఈరాశి నిరుద్యోగులకు ఈరోజు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సహకాలు అందుతాయి.
సింహా రాశి: ఈరాశి వారు ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి.
కన్యా రాశి: ఈరాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కీలక వ్యవహారాలలో రెండు రకాలయిన ఆలోచనల వలన ఇబ్బందులు తప్పవు. బంధువులు, మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలలో సకాలంలో  నూతన పెట్టుబడులు పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కోంటారు.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

  తులారాశి: ఈరాశి వారికి ఈరోజు  చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగస్థులు అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చిక రాశి: ఈరాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

 

ధనస్సు రాశి: ఈరాశి వారికి ఈరోజు  ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి.

 

మకర రాశి: ఈరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

 కుంభ రాశి: ఈరాశి వారికి ఈరోజు అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.

 

మీనరాశి: ఈరాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో వ్యయ, ప్రయాసలు అధికమవుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలించక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.   సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Buddha Purnima 2026: బుద్ధ పూర్ణిమ రోజు ఇవి కొనండి.. అదృష్టం మీవైపు తిరుగుతుంది

చిరిగిన, పాత బట్టలతో ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఏం జరుగుతుందంటే

Garuda Purana Part 09: గరుడపురాణం ప్రకారం ఆత్మ చేరుకునే 9వ పట్టణం బహుపాదపురం – ఇక్కడ అనుభవించే శిక్షలేంటో తెలుసా..?

Big Stories

×