Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 19న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక సమస్యల వలన నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులుంటాయి. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు లభిస్తాయి.
మిధున రాశి: ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగవంతం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితుల నుంచి ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉంది. వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు.
సింహ రాశి: ఈ రాశి వారు ఈరోజు అన్ని రకాల సమస్యలు నుండి బయట పడతారు. శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఈరోజు కీలక వ్యవహారాలలో పరిస్థితులు అనుకూలించవు. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. బంధువులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు బంధు వర్గం నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహ పరుస్తాయి. బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. దూరప్రయాణాలలో అవరోదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధు మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు వేధిస్తాయి.
మీన రాశి: ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కోర్టు వివాదాల పరిష్కారమౌతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా?