Cricket Players Retirement 2024: ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలెక్టర్లు యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేస్తున్నారు. దీంతో భారత జట్టులో చోటు సంపాదించుకున్న యువ ఆటగాళ్లు వారి ఆటతీరుతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ అదరగొడుతున్నారు. అయితే 2024 సంవత్సరం ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ఈ 2024 సంవత్సరం భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు {Cricket Players Retirement 2024} ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.
Also Read: Ashwin – Indian Players: అశ్విన్ రిటైర్మెంట్… సేఫ్ గా బయటపడ్డ ముగ్గురు ప్లేయర్లు ?
ఈ ఏడాదిలోనే 11 ఏళ్ల తర్వాత భారత జట్టు ఐసిసి ట్రోఫీని అందుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టి-20 ఫార్మాట్ లో విశ్వ విజేతగా నిలిచింది. అలాగే సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ ఓటమి వంటి చేదు జ్ఞాపకాలను కూడా అందుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఈ 2024 సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈ ఏడాది చాలామంది భారత స్టార్ ఆటగాళ్ల రిటైర్మెంట్ కూడా ఈ ఏడాదిలోనే జరిగింది. ఈ ఏడాది చాలా మంది {Cricket Players Retirement 2024} ప్రముఖ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.
ఇందులో కొంతమంది ప్లేయర్స్ కొన్ని ఫార్మాట్ లకు వీడ్కోలు పలకగా.. మరికొందరు ఆట మొత్తానికి వీడ్కోలు {Cricket Players Retirement 2024} పలికారు. ఈ సంవత్సరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లు టి-20 అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించారు. వీళ్లు మాత్రమే కాకుండా చాలామంది 2024లో క్రికెట్ కి వీడ్కోలు పలికారు. వీరిలో రవీంద్ర జడేజా టి-20 అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్ అయ్యాడు. కానీ టెస్ట్, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించలేదు. సిద్ధార్ద్ కౌల్ కూడా ఈ ఏడాది నవంబర్ 28న అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
అలాగే వరుణ్ అరోణ్ కూడా 2024 ఫిబ్రవరి నెలలో రెడ్ బాల్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక కేదార్ జాదవ్ కూడా ఈ ఏడాది జూన్ లో రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాటింగ్ తోనే కాకుండా వికెట్ కీపింగ్ తో ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్న దినేష్ కార్తీక్ కూడా ఈ ఏడాది జూన్ 1న తన పుట్టినరోజు సందర్భంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సౌరబ్ తివారి కూడా ఈ ఏడాది ఆరంభంలోనే అంతర్జాతీయ క్రికెట్ కి స్వస్తిపలికాడు. వీరితోపాటు వృద్ధిమాన్ సాహా కూడా నవంబర్ నెలలో క్రికెట్ కి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు.
Also Read: Watch Video: ఔటా.. నాటౌటా…బిత్తరపోయిన ప్లేయర్లు.. వీడియో వైరల్
ఇక భారత స్టార్ ఓపెనర్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ కూడా ఈ ఏడాది ఆగస్టు నెలలో క్రికెట్లోని అన్ని ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక 17 సంవత్సరాల వయసులో బాక్సింగ్ నుండి క్రికెట్ కి మారిన బరిందర్ స్రాన్ కూడా ఈ ఏడాది అన్ని ఫార్మాట్ లకి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత ఆటగాళ్లు మాత్రమే కాకుండా రిటైర్మెంట్ ప్రకటించిన ఇతర దేశ ఆటగాళ్ల విషయానికి వస్తే.. డీన్ ఎల్గర్, డేవిడ్ వార్నర్, హెన్రిచ్ క్లాసెన్, జేమ్స్ అండర్సన్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, షకీబ్ అలీ హసన్, మహమ్మదుల్లా, బోల్ట్, మ్యాథ్యూ వేడ్, నేల్ వాగ్నర్, కొలిన్ మున్రో, డేవిడ్ వైస్ ఇలా చాలామంది సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారు.