E-Paper
Advertisement

Horoscope Today December 20th : ఆ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి

Horoscope Today December 20th : ఆ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 20న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు  ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు, ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.

Advertisement

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు అన్ని రంగాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు  పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడ మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

Advertisement

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. మొండి బాకీలు తీర్చగలుగుతారు.

సింహ రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కన్యా రాశి : ఈ రాశి వారు ఈరోజు వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

తులా రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపార భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం పాత రుణాలు వసూలవుతాయి.

మకర రాశి : ఈ రాశి  నిరుద్యోగులకు ఈరోజు కీలక సమాచారం అందుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా పడుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు శత్రువులు సైతం మిత్రులుగా మరి సహాయ పడతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సహాన్నిస్తాయి.

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×