Pallavi Prashanth: గత సీజన్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. కామన్ మ్యాన్ రైతు బిడ్డ అని హౌస్ లోకి అడుగు పెట్టిన ఈయన తన ఎమోషనల్ డైలాగుల తో జనాలను బాగా ఆకట్టుకున్నాడు. దాంతో ఓటింగ్ లో దూసుకుపోయాడు. ఫైనల్ ఎపిసోడ్ కు విన్నర్ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్ లో డైలాగ్స్ పలికేవాడు.. నేను విన్నర్ అయితే ఆ ప్రైజ్ మనీ ని పేదలకు పంచేస్తాను. అంటూ భారీ డైలాగులు కొట్టాడు.. అందరు ఆయన మంచి పని చేస్తున్నాడని గుడ్డిగా నమ్మి అతనను జనాలు విన్నర్ ను చేసాడు.. నిరుపేద రైతు కుటుంబానికి సాయం చేస్తానని అన్నాడు.. కానీ ఏడాది అవుతున్నా కూడా బాబు సాయం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆయన పై సోషల్ మీడియాలో ఓ రేంజులో ట్రోలింగ్స్ మొదలయ్యాయి.. తాజాగా పల్లవి ప్రశాంత్ లుక్ మారింది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడం తో కామెంట్స్ తో సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నారు..
రైతు బిడ్డ గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.. కానీ సాయం చెయ్యలేదు. ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్‌మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు.. ఈ విషయంలో పల్లవి ప్రశాంత్ పై ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి.. సాయం అన్నావు మరి సైలెంట్ అయ్యావు అని కామెంట్స్ చేస్తున్నారు.. దాంతో అరకొర సాయంగా కొంత ఇచ్చాడు. అది కూడా అతనిది కాదు.. ఆట సందీప్, శివాజీ ఇద్దరు చేసిన సాయాన్ని ఆయన చేసినట్లు టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్‌లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ సోషల్ మీడియా లో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్య పోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్.. అతని న్యూ లుక్ సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది. బాగా మారిపోయావు ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు.. దీనిపై పల్లవి ప్రశాంత్ ఇప్పటివరకు స్పందించలేదు. అతనికి వచ్చిన ప్రైజ్ మనీతో స్వలాభాలు చూసుకున్నాడు. తప్ప సాయం చేసినట్లు కనిపించడం లేదని కొందరు అన్నదాతలు కూడా ఆయన పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా స్పందిస్తారేమో చూడాలి..