E-Paper
Advertisement

Horoscope  Today February 14th: ఆ రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు

Horoscope  Today February 14th: ఆ రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 14న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ఆప్తుల నుండి అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

Advertisement

వృషభం: చిన్ననాటి మిత్రులతో వివాదాలు తప్పవు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు.

మిధునం: ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

Advertisement

కర్కాటకం: జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు.

సింహం: మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్నేహితులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాల విస్తరణకు భాగస్తుల నుండి సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు.

కన్య: దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

తుల: వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం: ఉద్యోగస్తులకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనస్సు: అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఏర్పడతాయి.

మకరం: ఇంట్లో  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కుంభం: వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గొడవలు అయ్యే సూచనలున్నవి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

మీనం: విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చిన్ననాటి మిత్రుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×