BigTV English

Valentines day: మీ గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి పనులు చేస్తుందా? అయితే ఆమె మిమ్మల్ని కాకుండా మీ స్నేహితుడిని ఇష్టపడుతుంది

Valentines day: మీ గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి పనులు చేస్తుందా? అయితే ఆమె మిమ్మల్ని కాకుండా మీ స్నేహితుడిని ఇష్టపడుతుంది

ప్రేమలో పడడం యువతకు సహజమే. అయితే ఆ ప్రేమను నిలబెట్టుకోవడంలోనే గొప్పదనం ఉంటుంది. అయితే ఇప్పుడు నిజాయితీగల జీవిత భాగస్వామిలు చాలా తక్కువగా దొరుకుతున్నారు. తమ బాయ్ ఫ్రెండో లేదా గర్ల్ ఫ్రెండ్‌తో వస్తున్న ఇతర స్నేహితుల వైపు కూడా ఆకర్షితులవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇష్టపడుతుందో లేక మీతో పాటు వచ్చిన మీ స్నేహితుడిని ఇష్టపడుతుందో తెలుసుకోవాలి. ఆమెలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే ఆమె నేను స్నేహితుడి వైపు ఆకర్షితులవుతుందని అర్థం చేసుకోవాలి.


మీ గర్ల్ ఫ్రెండ్ మీ స్నేహితుడిని ఇష్టపడుతుందని కనిపెట్టే పనులు కొన్ని ఉన్నాయి. అలాంటి కొన్ని సాధారణ సంకేతాల గురించి ఇక్కడ ఇచ్చాను. మీ గర్ల్ ఫ్రెండ్ లో లేదా బాయ్ ఫ్రెండ్ లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆమెతో ఈ విషయం గురించి మాట్లాడండి.

మీరిద్దరూ మీ స్నేహితుల గ్రూపుతో కలిసి కూర్చున్నప్పుడు ఆమె మీ స్నేహితుడి పక్కన కూర్చోవడానికి ఇష్టపడడం, అతనితోనే ఎక్కువ సమయం మాట్లాడటం వంటివి చేస్తే కాస్త అనుమానించాల్సిందే. మీరు ఎంతగా మాట్లాడుతున్నా పట్టించుకోకుండా మీ స్నేహితులు ఏం చెబుతున్నాడో ఆమె వినేందుకు ఇష్టపడుతుందంటే ఆమె అతనిపై ఆసక్తి చూపుతోందని అర్థం చేసుకోవాలి


మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ మీ స్నేహితుడు లేదా స్నేహితురాలితో ఎక్కువగా మాట్లాడేందుకు అతను ఎక్కడుంటే అక్కడ ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఆమె శ్రద్ధ అతనిపైనేనని అర్థం చేసుకోండి. అలాగే అతని ఇష్టయిష్టాలను తెలుసుకోవడం, వాటిని పాటించడం వంటివి కూడా ఆమె మనసులోని భావాన్ని చెబుతున్నట్టే. అతను వాడే వస్తువులను ఇష్టపడడం, అతడిని తాకేందుకు ప్రయత్నించడం వంటివన్నీ కూడా మీ స్నేహితుడిని నీ గర్ల్ ఫ్రెండ్ ఇష్టపడుతుందని చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు. అలాంటి సమయంలో కూడా మీరు అధిక భావోద్వేగాలకు గురి కాకుండా… ఆమెతోనే మీ స్నేహితుడితోనూ మాట్లాడే సమస్యను పరిష్కరించుకోవాలి.

మీ గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాకుండా… మీ పక్కనున్న స్నేహితుడిని లేదా స్నేహితురాలిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆమెను అనుమానించాల్సిందే. మీ స్నేహితుడు దృష్టిని ఆకర్షించడానికి ఆమె ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటే ఆమె మనసులో మీ స్నేహితుడు ఉన్నాడని అర్థం చేసుకోండి. ఇంకా ఆమెను గుడ్డిగా నమ్మడం వంటివి మానుకోండి.

మీ స్నేహితుడు గురించిన వివరాలు మీరు చెబుతున్నప్పుడు ఆమె ఎంతో ఉద్వేగంగా, ఆసక్తిగా వింటూ ఆమెలో మీకన్నా అతనిపైన ఎక్కువ ఇష్టం ఉందని అర్థం. అంతేకాదు మీ గర్ల్ ఫ్రెండ్ మీకంటే మీ స్నేహితుడితోనే రిలాక్స్ గా, సానుహిత్యంగా కనిపిస్తూ ఉంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మీ గర్ల్ ఫ్రెండ్ మీ గురించి కాకుండా మీ స్నేహితుడి వివరాలు తెలుసుకొనేందకెు ప్రయత్నిస్తున్నా, అతనితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, మీకు తెలియకుండా ఫోన్లో టచ్ లో ఉన్నా కూడా ఆమెకు మీ స్నేహితుడి పట్ల ఎక్కువ శ్రద్ధ ఉందని అర్థం. సాధారణంగా ఒక్కోసారి ఇలా జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్ తో పాటు వచ్చే ఇతర స్నేహితుల్లో ఎవరో ఒకరు మీ గర్ల్ ఫ్రెండ్ కు నచ్చడం అనేది అక్కడక్కడ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని మీరు గుండెకు తీసుకోకుండా వీలైనంతగా జాగ్రత్త పడడమే ఉత్తమం.

ముందుగా ఆమె ప్రవర్తన మీకు తేడాగా అనిపిస్తే… ఆ విషయంలో కోపగించుకోవడం గొడవలు పడడం వంటికి చేయకుండా ముందు మీ గర్ల్ ఫ్రెండ్ తో మనసు విప్పి మాట్లాడండి. అలాగే మీ స్నేహితుడితో కూడా మాట్లాడండి. అది నిజమైతే మీరు తప్పుకోవడమే ఉత్తమం. నిజం కాకపోతే మీ భ్రమ అని అనుకోండి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×