E-Paper
Advertisement

Horoscope  Today February 23rd: ఆ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం – నూతన వాహన యోగం  

Horoscope  Today February 23rd: ఆ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో విజయం – నూతన వాహన యోగం  
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 23న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: ఊహించని కలహాలు ఏర్పడే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Advertisement

వృషభం: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

మిధునం: వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

Advertisement

కర్కాటకం: ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కన్య: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. గృహ నిర్మాణ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

తుల: బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆప్తుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ధనస్సు: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి

మకరం: కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం: వృత్తి, వ్యాపారాలు  నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీనం:  సోదరులతో భూవివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×