E-Paper
Advertisement

Horoscope  Today February 25th:  ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో అవాంతరాలు – ఆకస్మిక ప్రయాణాలు

Horoscope  Today February 25th:  ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో అవాంతరాలు – ఆకస్మిక ప్రయాణాలు
Advertisement

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. ఫిబ్రవరి 25న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి.

Advertisement

వృషభం: ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి నూతన రుణ యత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో మాట పట్టింపులుంటాయి.

మిధునం: వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు.

Advertisement

కర్కాటకం: ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

సింహం: ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది.

కన్య: సన్నిహితులతో విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల: దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ యత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.

వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి.

ధనస్సు: పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మకరం: ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

కుంభం: ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్న పాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

 

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×