Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈమె ఈ మధ్య బిజీగా మారింది. వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బాస్టర్ నటిస్తుంది. ఈ మధ్య ఈమె నటించిన ప్రతి మూవీ సూపర్ హిట్ టాక్ ను అందుకోవడం తో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది.. తెలుగులో స్టార్ ఇమేజ్ ను అందుకున్న ఈమె బాలీవుడ్ లో కూడా బిజి అవ్వాలని హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి మూవీతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. దాంతో ఈమె క్రేజ్ అక్కడ కూడా భారీగా పెరిగింది. రీసెంట్ గా హిందీలో రెండో సినిమా ఛావా మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ కూడా స్టార్ ఇమేజ్ ను అందుకున్న ఈ హీరోయిన్ కు దారుణమైన అవమానం జరిగిందని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది.. అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బాలీవుడ్ లో రష్మికను స్టార్ హీరోయిన్ ను చేసింది యానిమల్ మూవీ.. సందీప్ వంగ ( sandeep vanga ) , రణబీర్ కపూర్ ( Ranabir kapoor) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా బాలీవుడ్ లోనే కాదు, సౌత్ ఇండియా లో కూడా ఒక సెన్సేషన్.. ఈమె చేస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. దాంతో క్రేజ్ పెరిగింది. నెట్ ఫ్లిక్స్ లో కూడా అత్యధిక వారాలు ట్రెండ్ అయిన ఇండియన్ సినిమాలలో ఒకటి గా ‘యానిమల్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 1000 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదు. ఈ మూవీ క్రేజ్ ఏడాది అవుతున్నా తగ్గలేదు. అంతగా ఆ మూవీ జనాలను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ టైం లో రష్మికకు ఘోర అవమానం జరిగిందని ఇన్నాళ్లకు బయటపడింది. అయ్యో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం..
Also Read : వామ్మో.. ఇతని టాలెంట్ కు ఆస్కార్ ఇచ్చినా సరిపోదు మామా.. 8 భాషల్లో…
రష్మిక మందన్న యానిమల్ మూవీ షూటింగ్ టైంలో ఫుడ్ కోసం ఏడ్చిందట.. అసలు మ్యాటర్ లోకి వస్తే ఒక రోజు నిర్మాతకు ఫుడ్ అసలు బాగాలేదని, ఇలాంటివి తింటే నా ఆరోగ్యం పాడు అవుతుందని కంప్లైంట్ ఇచ్చిందట. ఈ విషయం ఎవరి ద్వారానో హీరో రణబీర్ కపూర్ కు తెలిసింది.. ఆ తర్వాత షూటింగ్ కి వచ్చేటప్పుడు రష్మిక కోసం స్పెషల్ గా తన ఇంటి నుండి వంటకాలను తెచ్చాడట. తన వంటవాడితో రష్మిక కోసం స్పెషల్ గా ఆమెకి ఏ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇష్టం ఉందో, ఆ ఫుడ్ ఐటమ్స్ ని దగ్గరుండి మరీ చేయించాడట. అలా ఆయన తోటి వారికి సాయం చెయ్యడంలో ఎప్పుడు ముందుంటాడు. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది రష్మిక. రణబీర్ కపూర్ తో పని చేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని, తన సెట్స్ లో పని చేసే ప్రతీ ఒక్కరితో రణబీర్ బాగుంటాడని చెప్పింది. అలా తెలుగులో స్టార్ అయిన ఆమెకు బాలీవుడ్ లో భోజనం పెట్టలేదనీ ఇది ఘోర అవమానం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో ఏ రేంజ్ లో చక్రం తిప్పుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రం కూడా త్వరలోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి దగ్గరగా వెళ్లనుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సల్మాన్ ఖాన్ తో కలిసి ‘సికందర్’ అనే చిత్రం చేస్తుంది.. త్వరలోనే విడుదల కాబోతుంది..