Tollywood villain : సినీ పరిశ్రమలో ఒకప్పుడు విలన్స్ ను చూస్తే భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. విలన్స్ కూడా హీరోలుగా స్మార్ట్ గా అందంగా పొడవుగా ఉంటున్నారు. సినిమాలో కేవలం క్యారక్టర్ మాత్రమే విలనిజం కనబరుస్తుంది. బయట మాత్రం చాలా సాఫ్ట్ గా అందరిని ఆకట్టుకుంటున్నారు. విలన్లు కూడా మంచి ఎత్తూపొడుగూ ఉంటున్నారు. హీరోలతో పోటీపడేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు.. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనే డౌట్ వస్తుంది. అందుకు ఒక కారణం. ఇపుడు మనం ఓ విలన్ గురించి ఎన్నో సంచలన విషయాలతో పాటుగా ఆ విలన్ ఎవరో? ఆయన 8 భాషల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది విలన్లు ఉన్నారు.. తమ విలనిజంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న వారేందరో ఉన్నారు. అందులో ఒకరు విలన్ ఆదిత్య మీనన్.. ఈయన గురించి తెలియని వాళ్ళు ఇండస్ట్రీ లో ఉండరు.. భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటివరకు మిర్చి, బిల్లా, పుష్ప.. ఇలా ఎన్నో సినిమాల్లో విలనిజం పండించిన ఆయన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన అలవాట్లతో పాటుగా సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అవేంటో ఒకసారి వివరంగా చూద్దాం..
ఆయన మాట్లాడుతూ.. హీరోలకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే హీరోగా అవకాశాలు వచ్చినా వదిలేసుకున్నాను. వివిధ రకాల పాత్రలు చేయడం ఇష్టం. అందుకే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాను. కెరీర్ ప్రారంభంలో వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ పోయాను.. అప్పుడు నేను ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ తర్వాత రియాలైజ్ అవ్వడంతో నాకు సెట్ అయ్యే క్యారక్టర్స్ ఎంపిక చేసుకున్నాను విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాను. నేను రిచ్ అని చెప్పను కానీ నా కుటుంబాన్ని బాగానే చూసుకుంటున్నాను అని ఆయన అన్నారు. అంతేకాదు.. ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాను. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా భిన్నమైన ప్లేసెస్‌కు వెళ్తుంటాను. అక్కడి ప్రజల గురించి, అలవాట్ల గురించి తెలుసుకుంటాను. వారి వంటకాలు ట్రై చేస్తాను. పాములు,కప్ప కాళ్లు, మొసలి మాంసం తిన్నాను. పాము తోలు తీసి, ముక్కలు చేసి వండిస్తారు, బాగుంటుంది. నేను నాస్తికుడిని, భగవంతుడు ఉన్నాడని నమ్మను అని చెప్పుకొచ్చాడు. అది విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది..
ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. ఆదిత్య వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈయన 8 భాషల్లో సినిమాలు చేస్తున్నాడు.. విలన్ గా ఇలా వరుస సినిమాలు చెయ్యడం మామూలు విషయం కాదు. నిజంగా గ్రేట్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే.. చేతిలో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. త్వరలోనే వాటిని అనౌన్స్ చెయ్యనున్నాడు. ఈయన చేస్తున్న సినిమాలు త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి..