Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 10న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మానసిక ఆందోళనలు కొంత చికాకు పరుస్తాయి. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మిధున రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొందరి ప్రవర్తన వలన మానసిక ఆందోళనలు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్యాలు బాధిస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతాన వివాహ విషయం ఇంట్లో ప్రస్తావనకు వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.
కన్యా రాశి : ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు ఇతరులకు నచ్చే విధంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి రావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి : ఈ రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. దూరప్రాంత బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారంలో విపరీతమైన లాభాలను పొందుతారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక వ్యవహారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్త్రా భరణాలను కొనుగోలు చేస్తారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట విలువ మరింత పెరుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొన్ని విషయాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం తో కొన్ని పనులు పూర్తవుతాయి.
మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సోదరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు.
మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. రుణబాధల నుంచి ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగవుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. స్త్రీ సంబంధిత ధన లాభ సూచనలు ఉన్నవి.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?