Jio Premium Rate Service Scam: ఈజీ మనీకి అలవాటు పడ్డ సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి కాల్స్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా మరో కొత్తతరం మోసాలతో జనాల బ్యాంక్ ఖాతాలను ఊడ్చేస్తున్నారు. జియో ‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’ పేరుతో సైబర్ ఫ్రాడ్స్ కు పాల్పడుతున్నారు. ఈ మోసాలపై ప్రముఖ టెలికాం సంస్థ జియో తన యూజర్లను అప్రమత్తం చేసింది. ఈ మోసం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ కు రియాక్ట్ కాకూడదని హెచ్చరించింది.
ఇంతకీ ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్ అంటే ఏంటి?
గుర్తు తెలియని ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి మీకు కాల్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మిస్ డ్ కాల్ ఇస్తారు. చాలా మంది తమకు కాల్ చేసింది ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. ఇదే వారి కొపం ముంచుతుంది. తిరిగి కాల్ చేస్తే బిల్లు తడిసి మోపెడు అవుతుంది. మీకు మిస్ డ్ కాల్ వచ్చిన నెంబర్ కు రిటర్న్ కాల్ చేయడం వల్ల ప్రీమియం రేట్ సర్వీస్ కు మీ కాల్ కనెక్ట్ అవుతుంది. పెద్దమొత్తంలో బిల్లు పడుతుంది. సాధారణ ఇంటర్నేషనల్ నెంబర్లకు చేసే కాల్స్ తో పోల్చితే ఈ నంబర్లకు కాల్ చేసినప్పుడు రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడేది కాసేపే అయినా వందల రూపాయల బిల్లు వస్తుంది. గత కొద్ది రోజులుగా ఈ తరహా కాల్స్ ఎక్కువ అయిన నేపథ్యంలో జియో తన వినియోగదారులను అలర్ట్ చేసింది.
అనుమానాస్పద కాల్స్ ను ఎలా గుర్తించాలి?
⦿ అసాధారణ సమాయాల్లో ఈ కాల్స్ వస్తుంటాయి.
⦿ డిస్‌కనెక్ట్ కావడానికి ముందు చాలా తక్కువ సమయం రింగ్ అవుతుంది.
⦿ తెలియని అంతర్జాతీయ కోడ్ లతో కాల్స్ వస్తాయి.
⦿ ఒకే నెంబర్ లేదంటే ఇలాంటి అనేక నెంబర్ల నుంచి పదే పదే కాల్స్ వస్తాయి.
Read Also: జియో నుంచి అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్, రూ. 1234తో ఏడాది వ్యాలిడిటీ, మరెన్నో బెనిఫిట్స్!
‘ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్’ నుంచి ఎలా తప్పించుకోవాలంటే?
⦿ అనుమానాస్పద అంతర్జాతీయ నంబర్ల నుంచి పదే పదే కాల్స్ వస్తే మీ మొబైల్ బ్లాకింగ్ ఫీచర్‌ను ఉపయోగించి వాటిని రాకుండా జాగ్రత్తపడండి.
⦿ +91 కాకుండా ఇంకా ఏ ఇతర కోడ్ తో వచ్చే నెంబర్లను కూడా పట్టించుకోండి. తిరిగి కాల్స్ చేయకండి.
⦿ మీకు అవసరం లేకపోతే అవుట్ గోయింగ్ అంతర్జాతీయ కాల్స్ ను బ్లాక్ చేయమని మీ టెలికాం ప్రొవైడర్ ను అడగండి.
⦿ ఈ స్కామ్ గురించి అవగాహన పెంచేందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు తెలియజేయండి.
⦿ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక అధికారులకు అనుమానాస్పద నంబర్లను గురించి చెప్పండి.
Read Also: ఈ స్మార్ట్ ఫోన్ లో 80 శాతానికి మించి ఛార్జింగ్ కాదు, ఎందుకో తెలుసా?